ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గోరు ముద్దలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

గోరుముద్దలు 

నిద్దురా మెలకువ కూడా 

గోరుముద్దలే 

ఒత్తిడికి 

*******

గురు దక్షిణ 

నాట్యం నేర్పిన గురువని! 

ఆ గాలికి 

పూలు పత్రాలను రాల్చి 

గురుదక్షిణ లిస్తుంటాయి 

ఆ చెట్లు 

******

మచ్చలోడు 

అందగాడని అందరూ అంటూనే ఉన్నా 

మాటి మాటికి  ఆ మబ్బుల మాటుకెళ్ళి 

ముఖం కడుకొస్తాడేమిటా మచ్చలోడు!

******

బుగ్గన చుక్క 

అద్దంలోని చందమామకు 

బుగ్గన చుక్క పెట్టానని 

నాకు వినబడేలా పక్కున నవ్వింది 

ఆ కలువ

*****