Like-o-Meter
[Total: 0 Average: 0]
కరువుతో కాల్చడానికే
వేసవి రెక్కింగ్.
గొంతులోని విషాన్ని
కక్కలేక, మింగలేక, పొలం దున్నుతూ
పరమశివుడు.
కడుపునిండా గడ్డితిన్నప్పటి-
పాత జ్ఞాపకాల్ని ‘నెమరేస్తూ’
ఓ ఆవు.
నీళ్ళులేని ఏట్లో
ముఖం వెతుక్కుంటూ
పున్నమి చంద్రుడు.
ముస్తాబైన మేఘాన్ని చూసి,
సిగ్గు మొగ్గైన
పైరు పెళ్ళికూతురు.
తడిస్తే జలుబొస్తుందని
మొక్క మీద గొడుగులా
తెల్లటి మబ్బు.
ఒక్క గింజనూ కనలేక
గొడ్రాలైంది
వరిచేను.
పిడికెడు మెతుకుల ‘పిండం’ కోసం
కబురందిన రైతు
కాకి లా వచ్చి వాలాడు.
__పి.రామకృష్ణ