ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

హృదయ రాగము

Like-o-Meter
[Total: 1 Average: 4]

 

తెలియరాని రాగము
అలా తేలివచ్చి సోకెను
పలుక నేర్చి భావము
సుమలతను చేరి పాకెను
హృదయరాగమై…హృదయరాగమై

నయన ద్వయపు నర్తనం
అనునయపు భావ వీక్షణం
శృతి, లయల జీవనం
మితిలేని రస నివేదనం
హృదయరాగమై…హృదయరాగమై

రసికరాజు రంగిది
రస భసిత యవ్వన పొంగిది
అంగసంగ హంగిది
శృంగార స్నిగ్ధ భంగిది
హృదయరాగమై…హృదయరాగమై

సోమపానమేలనో
సుఖపాన లీన జీవికి
సామగానమౌను, నీ
ముఖవీణ, సఖుని నఖమున
హృదయరాగమై…హృదయరాగమై