ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

జన్మరహస్యం

Like-o-Meter
[Total: 0 Average: 0]

కొత్తగా తెలిసిన జన్మరహస్యం
అక్కరలేని బిడ్డను దొప్పలొ పెట్టి నీళ్ళలో వదిలేయడం?

***
వెలుతురు అంటని చీకట్లో
నీళ్ళలో ముఖబింబం కనిపించదు
వ్యాపించే వెలుతురుతో బాటు నిజం మెలిపెడుతోంది.

నిజాన్ని తన కడుపులోనే దాచేసి
తన ఒళ్ళోనే చనిపోయిన అమ్మ.

“సూర్యదేవుడి అనుగ్రహం
తెల్లటి కాంతితో, కుమ్మరివాడు మట్టితో బొమ్మని చెసినట్లుగా
కిరణాల పడవ మీద వచ్చావు”
అమ్మ చెబుతుంటే ఎంత గర్వం.

శిశుసృష్టిలో దైహికరహస్యం తెలిసాక
ఈ తల్లిగర్భం నుంచి కాక
ప్రేమపాశం తెలియని నిర్దయురాలైన
తల్లిగర్భమే తన పుట్టుక – నాకే ఒక విస్మయం.!!!

దుఃఖం పడవతో జీవనసాగరాన్నీ ఈదుతూనే
విలువిద్యలో కీర్తి సంపాదించి
దుర్యోధన మహారాజు కుడిభుజంగా,
కీరీటంలో ప్రకాశించే మణిననిపించుకున్నాక
ఒక సంతృప్తి.

రాధకి కలిగిన దైవ పుత్రుడిని అనుకొన్నదంతా అబద్దం,
కుంతి పుత్రుడనని తేలిన నిజం
లోకాన్నంతా చీకటిమయం చేసేసాయి

రూపులేని నల్లటినదిలో ఈత
తనది అచ్చం కుంతి రూపమట!

***
వెలుతురు సోకని చీకట్లో
నీళ్ళలొ నా ముఖబింబం నాకే మాత్రమూ కనిపించదు.


(ఎస్.ఎల్ భైరప్ప ’ పర్వ’ చదివాక…..)