ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

లోకం కోసం…

Like-o-Meter
[Total: 0 Average: 0]

పండు ముదుసలి వగ్గులా

ముడతలు పడ్డ దేహంతో

ఆ చెట్టు

 

ఆకలేసిన కాకిలా

ఆరో ఋతువు

ఆకులన్నీ అద్దుకు తినేసింది

 

ఆకతాయిలకి

అరవై చేతులతో

వడ్డించిన ఆ చేతులు

ఇప్పుడు బోసిపోతూ..

 

లేదనే మాటే తెలీని చెట్టు

నీడ కూడా ఇవ్వలేకపోతున్నందుకు

తడి కళ్ళతో తేమగా

ఆ కొమ్మ చివరన

ఓ చిగురుటాకులా

మళ్ళీ జన్మిస్తూ…