ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మనసు కాలమ్

Like-o-Meter
[Total: 0 Average: 0]

రోజూ వెలుగులో పుట్టి
చీకట్లో కలసిపోతోంది 
ఎండలోని వేడిని కొలుస్తుంది 
వానలోని చినుకుల్ని తడుముతుంది 
శీతకాలపు వణుకులో స్వరాల్ని పలికిస్తుంది 
శిశిరంలో రాలిపోయే ఆకుల్ని జోకొడుతుంది 
అంతలోనే వసంతమోహంతో
కౌగిలించుకుంటుంది 
అత్యంత పురాతనమైనదే కానీ ఎప్పటికీ కొత్తదే 
మనిషి మనసులా!