ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మినీ కవితలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 వెన్నెల్లో, సాలెగూటి వల వేసి

అందిన కాడికి ఆ నక్షత్రాలను

పట్టేశానోయ్!

తక్కువైపోయాయంటే ఎట్టామరి?

*************

తన వైపుకు

నా అడుగులు పడుతున్నాయన్న ధీమాతో

తను ఎదగడం మొదలు బెట్టిందా కొండ!

***************

నావికుణ్ణి వెతుక్కుంటూ

వచ్చే తీరం కదటోయ్

వసంతం

**************