ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మిస్డ్ కాల్

Like-o-Meter
[Total: 0 Average: 0]

మంచు కత్తితో పొడిచి

సాక్ష్యం లేకుండానే పారిపోయే

మొరటు సరసం…

 

మంచినిద్రలో

చెంప పై ఛళ్లుక్కున చాచికొట్టి

మాయమైన మెరుపు పిలుపు…

 

అకవుల అద్దె ఏడ్పు, దొంగ ఆర్ద్రతలా

స్వప్నపుష్పంపై వాలి చెరుస్తున్న మిడుతల దండులా

నీ గొంతు…

 

ప్రియా!

నిజంగానే

నీ ప్రత్యక్ష, అప్రత్యక్షాలతో

విసిగిపోయాను…