Like-o-Meter
[Total: 0 Average: 0]
1.
అలిగి
మొహం మాటేసి
అలా వెళ్ళి క్షమించి
మళ్ళీ మూన్ వాక్
చేస్తావని ఆశ వుండేది!
కానీ
కనుపాపల పై ఇనుప తెరలు పరిచావ్….
2
తేనె కత్తులు
తయారు చేసుకొని పెట్టుకున్నాను,
నువ్వొచ్చి
ముద్దాడి పోతే
మింగుదామని…
3
చాలా సంవత్సరాల క్రితం
రాసి పంపని ప్రేమలేఖ ఇది
ఇప్పటికీ పచ్చి వాసన వేస్తో…
కాని భాష మారిపోయింది