ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నా మనసు

Like-o-Meter
[Total: 0 Average: 0]

లోకాన్ని ఓ వైపుకు, నన్నోవైపుకు నెట్టేస్తూ

బలవంతానా ఓ విభజన రేఖను గీసిందెందుకో నా మనసు

పోనీ! లోకం వైపు ఓ అడుగేద్దాం, దాని అంతరంగాన్ని చదివేద్దాం అనుకుంటే 

నీదే నిజమంటూ ఎక్కడలేని రాజసాన్ని నాకాపాదిస్తుంది
నా కనుసన్నల్లో మెలగాల్సిన కన్నెపిల్ల ఈ లోకమని నన్నొప్పిస్తుంది
తెలుసు! నన్ను చూసి పరిహసిస్తుంది ఈ లోకమని
తనతో పల్లవించని నాకై ఏ గాంధర్వాలనూ వినిపించదనీ తెలుసు
ఐనా ఎందుకో ఆ విభజనరేఖను దాటలేను నేను
నాకు అహమనుకో లేక  నాపై నాకే అభిమానమనుకో, ఏమైనా అనుకో నువ్ 
గాయాన్నైనా గేయంలా మలచే మనసు నాకుందని మాత్రమే అనగలను నేను.