ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నీలికాంతి

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఒళ్ళంతా

పూలు పూసే చెట్టులా

ప్రతి రాత్రీ నువ్వు

సీతాకోక చిలకనై

నేను!

* * *

వీణ తీగలే

నన్ను మీటుతున్నాయి

నీ ముంగురులు

మౌనాన్ని

భగ్నం చేయకుండా

ఒక రాగం లీలగా

* * *
 

పరుచుకున్న నీలికాంతిలో

నక్షత్రాలు మన చుట్టూ

నాట్యమాడుతున్నాయి చూడు!