ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నింగిమేడలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

వాన నీళ్ళని తాగి
గుటకేస్తోన్న ఇటక
రాళ్ళ గుట్ట యిసక గుట్టతో
గుసగుసలాడ్తోంది

గెంతుతోన్న కప్పకెందుకో ఆయాసం
గుండె దాని గొంతులో కొట్టుకొంటోంది

గుడ్డివెలుగులో
వన్నం తింటోన్న కూలీ కుటుంబం
వాళ్ళని చూస్తో
కునకడానికి సిద్ధమౌతోన్న కుంపటి

కార్పొరేట్ కుళ్ళు చేరేందుకు
ఇంకా టైముంది…