ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నిన్ను చూసినంతనే

Like-o-Meter
[Total: 0 Average: 0]

నిన్ను చూసినంతనే శిశిరంలో వసంతం
జ్ఞాపకాల గుబురులో ఆకుపచ్చని ప్రశాంతం       ||నిన్ను||

ఆ ఆకసాన తేలు జాబిలికి చాలు ఒక పున్నమి
నా జాలితనము కోరునే ప్రతిరోజు వెన్నలని
ఇది వరమో శాపమో లేక సుమశరుని జాలమో!
సిరిమల్లె మురిసి విరిసేటి మధుర కాలమో!        ||నిన్ను||

అలలేని సాగరమా నీవు! మేఘాలు చూడని సౌందర్యమా!
నునులేత చివురుల ముద్దులిడే మంచుముత్యమా!
ఇది కన్న కలనా విన్న కథనా లేక జన్మజన్మల స్మృతినా?
సెలయేటి నీటి పాటలో కదిలే వర్షగీతమా?         ||నిన్ను||

కొలనులోని కలువకు ఆ నీరే అద్దమా!
ఒక చూపురాయి వేసినంతనే చెదిరేది అందమా?
నిష్పల ఎడారి దారిలో ఏలనో పూల నర్తనం?
కశ్మలమంటని గుండె లోతులో కన్నీటి వర్తనం!    ||నిన్ను||