ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పగలు రైతు

Like-o-Meter
[Total: 0 Average: 0]

పగలు రైతు
కిరణాల్ని నాటుతూ వెళతాడా!
కోట్ల కళ్ళు విచ్చుకొంటాయి

మాయదారి రాత్రి రౌతు
గుర్రపు డెక్కలు విదిల్చిన మంచు
పగలు రైతు పాదాల కింద అణిగిపోతుంది

రహస్యాల్ని దాచుకోలేని
నిష్టుర నగ్నత్వంను లోకం కప్పుకొంటుంది

చెమట ఘాటులో
కిరణాల్ని నాటుతూ
పగలు రైతు.