ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పరిణామం 

Like-o-Meter
[Total: 0 Average: 0]

అడవి, తోట

పెరడు, కుండీ

నాలుగు ముక్కల్లో

పచ్చని చరిత్ర పరిణామం ఇదే.

         *******

నీ నా భావాల తీగలు పాకుతూ

లోకమంతా అల్లుకున్న పందిరి నీడలో

మన మనసులు నేర్చుకునే

ప్రాకృతిక పాఠాలే

రాత్రింబవళ్ళైనాయి.

         *******

ఎవరు నడుస్తారనో

అలా మేఘాల మధ్య

కాలిబాట వేసుకుంటూ పోతోంది

ఆ మెరుపు.

        *******

ఎర్ర సిరాతో

గుండెలు పగిలే

ముగింపులు రాయడమే

వచ్చు ఆ రోడ్డుకి.

      ********