ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ప్రేమ కట్టడం…

Like-o-Meter
[Total: 0 Average: 0]

1
జారుతున్న మంచు దుప్పటిలో
ఉదయించే సూర్యకిరణాల వెచ్చదనంతో
ధాన్యంలో నిమగ్నమైన యోగిలా
అంతంత మాత్రమే ప్రవహించే యమునానది కన్నుల్లో
ప్రతిబింబంగా మారాలని ప్రయత్నించే ”తాజమహల్” మెట్లమీద
ఈ ఉదయం అపురూపం.

శరీరం శిధిలమై చరిత్రలో భాగమైపోయింది
ప్రేమ సజీవమై పాలరాతిగుండెలో ఒదిగిపోయింది
అడుగు అడుగునా ప్రేమ శిల్పచాతుర్యాలలో నిండి
తన ఒడిలో చేరమంటూ పిలుస్తోంది.

ప్రేమాన్వేషణ మోదలవుతుంది
జారిపోయిన గతంలోంచి శిధిలమవుతున్న
ప్రేమ జీవించి-
ప్రేమలేఖని అందించి చదువుకోమంది
ఎన్నో అక్షరాలు గుండెలో వాలీ
స్వప్నజగత్తుని సిద్ధంచేసి అనంత తీరలకు మోసుకు వెళతాయి.
ఎన్నో భాషలలో ప్రేమ” తాజమహల్” మెట్లనిండా పరుచుకుంది
పూచిన ప్రేమపూలని ప్రతి పాదం స్వీకరించింది

2
గైడ్ వివరించే చరిత్రలో
కఠినశిలలు మోసిన కూలీల చెమటధారలు
చలువరాతి పలకలకింద నలిగిన బతుకుల ఆనవాళ్ళు
రాతిలో పూసిన పూలరెమ్మలలో కనిపిస్తాయి
వేళ్ళు తీర్చిదిద్దిన నగిషీల చిత్రాలు “తాజమహల్” ఆత్మని కమ్ముకున్నాయి

ప్రేమ చరిత్ర రెండు మనసుల్లో ప్రవహించినప్పుడు
ఆ మహకావ్యానికి మౌనంగా” సలాం” చెప్పడం
ఆ సాయంసంధ్యలో షాజహాన్ ప్రేమని మోసుకెళుతున్నంత అనుభూతి..

* * * *** *** ***
{jcomments on}