ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పురా రాగం

Like-o-Meter
[Total: 0 Average: 0]

1

అమరగాన మోహ దాహర్తి

సహస్రాది గ్రీష్మారణ్యాల సంచారం….

2

వెయ్యిన్నొక్క మార్మిక స్వప్న రంగులు 
వేచి చూస్తున్నాయి
వొకే వొక్క మంత్ర చిత్ర గానం కోసం…

3

రుతువులు వొస్తూ వుంటాయి
పోతూవుంటాయి
ఒక్క వేణువుని ప్రసాదించలేని తనంతో….

4

వొకేవొక్క సామవేద వాయులీన స్పర్శ కోసం
జన్మ జన్మాల దాహంతో 
పురా రాగం