Like-o-Meter
[Total: 0 Average: 0]
పాఠకులందరికీ అరవై ఐదవ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు
సడలనీయదు
కడలి, అలల పొంకాన్ని
నడినెత్తి సూర్యుడు
వడలింపజూసినా
అడుగైన కదలదు
చూడు, ఆ కొండ
పిడుగు బెదిరించినా
జడివానకైనా
పక్కలో బల్లెమై
‘పాకు’వాడెవడైన
మొక్కవోనిస్తామా
నిక్కమౌ జాతిని!
అరి మర్దన, జనార్దనడు,
మురవైరి చక్రమై
ధ్యాన మగ్నుడు, నీలగాత్రుని
జ్వాలనేత్రపు జ్వలనమై
కాళికా త్రిదలనమై
కాచువారము మేమెరా
జగతి నిలుచువారము మేమెరా!