ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సర్దుకుపోదాం

Like-o-Meter
[Total: 0 Average: 0]

మనకున్నదంతా గతమేనోయ్
దాన్నే అప్పుడప్పుడూ తవ్వుకుంటూ దాచుకుంటాం
వర్తమానం భవిష్యత్తులుగా
ఎందుకంటే సర్దుబాటులో సవ్యసాచులం మేము
నిన్నటి మా అనాకారీ బ్రతుకే
నేడు ప్రాభావమై తోస్తుంది మాకు
ఎప్పుడూ మారనిదే మా చరిత్రని
తెలిసిన మర్మయోగులం కదా మేము
ఇంకా రేపెలా అనే భయం ఎక్కడిది మాకు
అందుకేనేమో కలలో మాకందే స్వర్గం కూడా
కోటి విలువ చేయదు
అలా అని మా ఊహలు మాత్రం
అంతకు మించుతాయేమిటోయ్
కొందరి నేతల వాస్తవాలే కోట్లను మించితే
ఇక వారి ఊహల్ని కలల్ని నిజం చేయడానికి
ఏ యజ్ఞం చేయాలా కుబేరుడు పాపం
ఐన నాకో విషయం అర్ధం కాదోయ్
ఇంత మందికి సర్దుకు పోవడం నేర్పిన ఆ మహాలక్ష్మి
కొందరితో ఎందుకలా సర్డుకుపోతోందో!
అందుకే ఏం చేద్దాం
కొన్ని అర్ధం కావులే అని సరిపెట్టుకుందాం
అన్నీ అర్ధమైనట్లే సర్దుకుపోదాం.