పల్లవి: ఎదురేముంది నాకంటూ, పదపదవే నువ్వు ఓ మనసా!
విలువేముంది నీకంటూ, మరి ముడుచుకునుంటే ప్రతివేళ ll 2 ll
చరణం: వాడని నవ్వుల వేడుకలే జీవితమంటే
వీడని మమతల వెల్లువలే నందనమంటే
ఆ మమతల వెన్నెలలో ఈ నవ్వుల పున్నమిలో
నిండు చందమామవై నిలవవె నువ్వు నా మనసా!
విరామమెందుకు నాకంటూ వినోదమే నా పథమంటూ
అందరి వైపుల కడుగెయ్యి ఆపదలను తుడిచెయ్యి
ఆగక జారే ఆనందాశృవులే అక్షితలు నీకని చాటవె నా మనసా!
ll ఎదురేముంది ll
చరణం: పంతం పట్టు! నవ్వుల సీమంతం ఈ లోకానికి చేయిస్తానంటూ
ఒట్టే పెట్టు! కరువై పోయిన మానవతను కన్నుల విందుగ పండిస్తానంటూ
విలువలు కలువలుగా విరబూస్తే నలుగురితో నేనంటూ అందరొక్కటిగ నినదిస్తే
అందని స్వర్గం ఏముందంటూ, రేపటి భవిత మనదేనంటూ
నినదిస్తూ నువ్ ముందుకు సాగవే నా మనసా!
ll ఎదురేముంది ll