ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శ్రావణమేఘాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

అమ్మా నాన్న

పిట్టలు ఎగిరిపోతాయి
బరువును మోసిన చెట్టే
భారంగా నిలబడుతుంది

పిట్టలు ఎగురుకుంటూ వస్తాయి
భారంగా నిలబడిన చెట్టే
సంబరంగా నవ్వుతుంది.

* * *

బెస్ట్ హాఫ్

ఒత్తి మీద
ఒద్దికగా కూర్చొని
మౌనంగా
నన్ను స్పృశిస్తూ
వెలుగు

మత్తుగా పెనవేసుకుంటూ
జ్ఞాపకాలు పలకరిస్తుంటే
మౌనానికి మరోవైపు
నాలో నేను

నీ నీడలో నేను