ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తలపులు

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆ తలుపులు తెరవకోయ్

స్పందించవేమని నన్ను నిలదీసే

ప్రకృతి అందాలెన్నో ఆగున్నాయ్ వాటి వెనుక

నిజమే ఏకాంతం దొరికిననాడెపుడో చూసా

అమ్మ లాలిపాటలా అడిగినవి కొన్నైతే

మేఘ గర్జనలా విరుచుకుపడ్డవేన్నో

అందుకే ఆ తలుపులు తెరవకు

సరేలే! తెరవను గానీ

అసలెందుకొచ్చిందో చెప్పవోయ్ అందాలతో నీకీ పేచీ

నాగరికత నిన్ను నాలుగు గోడల మధ్యకే నేట్టేసిందా?

నీ ఏకాంత జ్యోతి వెలిగే తీరిక కూడా లేకుండా చేసిందా ఈ

 ఆధునికత

చెప్పవోయ్ పర్లేదు నిజమిదేనని సిగ్గెందుకిందులో

అసలీ నిజానికి మాలగా కడితే అందరి జీవితాలను

సజ్జలో మిగిలే పూవొక్కటీ ఉండదులేవోయ్

ఎందుకంటావా ఊహించడం స్వప్నించడమననేవి

ఇరు పార్శ్వాలు నాకనీ మరచిపోయిన మనస్సులతో

ఏ పాటి సుగంధాన్ని ఈ జీవితాలకు అద్దగలం మనం

చెప్పు

అందుకే ఇకనైనా మనసులను బంధించిన అదృశ్య

శృంఖలాలను తెగ్గొట్టి

ఒక్కసారి మన ఊహల బాగువుల మధ్యకీ లోకాన్ని పట్టి

 తెచ్చుకుందాం

గాఢ నిద్రలో అన్నైతే స్వప్నాలను విరబూయించి వాటి

పరిమళాన్ని ఆసాంతం

ఆఘ్రాణిద్దాం

నిలదీసిన ఈ ప్రకృతే అందాల ఎదుటే

రొమ్ము విరుచుకుని నిలబడదాం! రా నేస్తం

తలపులు తప్ప తలుపులే వద్దు

మా మనసులకని నినదిద్దాం రా!
*******