ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తత్వమసి..

Like-o-Meter
[Total: 0 Average: 0]

నీతో మాటాడుతున్న
సమయమంతా
నా హృదయం
సున్నితత్వాన్ని
పొందుతోంది…

ఏమైనా
నీవు నాలో
ప్రవహించే
జీవనదివి…

దేహంలోని
ప్రతి పాయా
నీ ప్రవాహంతో
పునీతమవుతూ
ఉత్తేజితమవుతోంది…


నదినిలా
నాలో యింకనీ
ఇగరనీ…

మరల మరల
వర్షిస్తూ
చిగురు తొడగనీ..

pay per click