ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వెకిలి జీవితం

Like-o-Meter
[Total: 1 Average: 4]

గుండుసూదికి గుచ్చిన సీతాకోకచిలుక
తెరుచుకొన్న నోటిలో గడ్డకట్టిన బాధను
విరజిమ్ముతోన్న నెత్తుటి బొట్టులో
ఒక జీవితమంత నిర్లక్ష్యంతో
గద్ద గోళ్ళను
అద్ది, రాసిన రాతలకు
అర్థాలు వెదుక్కొంటున్నావా?

కలుగులో దాక్కొన్న ఎలుకను
కనిపెట్టి చంపే విషగుళికలో
నా నగర తత్వం రూపం,
బానిసత్వం నీడల్ని పరిచి
అడ్డుగోడల గుడ్డికళ్ళకు
కాటుక పెట్టుకొంటున్నావా?

కరువుతో గుండాగిపోతున్న
చేపపిల్ల మెదడులోని చచ్చుకణాల
దుర్భర ఘోషను
స్టెటత్ స్కోపు గొట్టంలో రికార్డింగ్ డ్యాన్సులా
వింటున్నావా?

చల్లారిపోయిన పిల్లదనంతో
నీకు పుట్టిన ముసలి కొడుకులు
ముడుత కండరాల్తో
ఆకుపచ్చని కాళ్ళను నరికేసుకొన్న తర్వాత
మిగిలిందేమిటి నీకు?