ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

విలాసమిదియే!

Like-o-Meter
[Total: 0 Average: 0]

నిద్రహీన నిశివేళల విరిసే చీకటి
క్షుద్ర నిర్దయ శీతగాలి నిట బిగిసెను పిడికిలి

కాలమేఘ మహా జాలమును పన్నెను ఆకసం
జ్వలంత జీవనమారిపోవుననె మానసం

శిశిర ఋతు హత భూరుహమ్ముల భాషలు
విసురు గత దిన బాష్ప కణముల ఘోషలు

ఫాలతలాన కానుపించని చిత్ర, గుప్త వక్ర వ్రాతలు
జాలి లేని విధి కౄర పద ఘట్టన గురుతులు

ప్రభాత మెరుగని నభోవీధివలె
అభాగ్య బంధుర అభాసావృత
మదీయ మానస విలాపమిదియె, విలాసమిదియె!