ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

విషాదగీతము

Like-o-Meter
[Total: 0 Average: 0]

మనసును ఇచ్చి మనసును పొందిన వారున్నారా?
ప్రేమను ఎరుగని లోకంలో ముళ్ళే పూలౌనా?

రాలను తొలచి, పూలను మలచిన
తుమ్మెద వాలేనా?
వాలిన గానీ, మధువును గ్రోలి
సుఖమును పొందేనా?
ఏలా? భ్రమ లింకేలా, జీవన
జ్వాలలో శలభాన్ని!

నదిలోన నీరింకును గానీ,
ఇసుకే ఇంకేనా?
ముసుగులు వేసిన మనసులలోని
లొసుగులు తెలిసేనా?
మోసం, వేసిన వేషం ద్వేషం
బ్రతుకే ఒక దోషం!

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>