ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వొద్దులే

Like-o-Meter
[Total: 0 Average: 0]

కంట్లో నీళ్ళ చుక్కల్తో
నిన్ను చూస్తే
పగిలిపోయిన ఆకాసం నుండి
జాబిల్లి రాలిపడినట్టనిపిస్తాది

బతుకు అపస్వరం పలికినాక
అవసరం యెవరిదైతేనేంలే!

యెవడో వాడు
మొగవాడంతే
నువ్వో జూకామల్లెవి

అంతా ముగిసినాక
వాడు..ఎవడైతేనేంలే
ఊళ్ళో మరో గదిలో మరో జూకామల్లెకోసం పోతాడు
నువ్వు మాత్రం
అదే గదిలో మరోసారి
వికసించడానికి పనికిమాలిన ప్రయత్నం చేస్తాంటావు

నీ కంట్లో నీళ్ళ చుక్కల్ని చూసినప్పుడు
యెనక్కి పారని నదే గుర్తుకొస్తాది

అలా కన్నీటిని ఖర్చెట్టుకోమాక!
గుడ్డిముండా లోకానికి
తడమడమే గాని తడవడం తెలీదు