ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మహాత్ములు మన అభిప్రాయాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

స్వాతంత్ర్యోద్యమాన్ని అహింసాయుతంగా మలచి దేశ ప్రజలందరినీ దాదాపుగా ఒకేతాటిపై నడిపించిన గాంధీ మహాత్ముడే. స్వాతంత్ర్యపోరాటంలో ఒక్కసారి కూడా అరెస్టు కాబడని అంబేద్కర్, దళితజనుల కోసం చేసిన పోరాటానికి భారతరత్నే. మనం చదువుకున్న పాఠ్యాంశాల ఆధారంగా మనం అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. దురదృష్టవశాత్తు, కాంగ్రెస్ కమ్యూనిస్టు మేధావులు దేశచరిత్రను ఉన్నదున్నట్లుగా ఏనాడు చెప్పలేదు. వారు వక్రీకరించిన చరిత్రే చదివి మన మన అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నాం.

గాంధీని చంపిన హంతకుడుగా మాత్రమే గాడ్సే పరిచయం మనకు మన పాఠాల్లో ఇవ్వబడింది. ఒక హంతకుడుగా ముద్రపడిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకెవ్వరికీ అందుబాటులో లేదు. కాబట్టే, మన దృష్టిలో అతనో దుర్మార్గుడు! ఒక్క గాడ్సే అని కాదు… చరిత్రలో తొంగిచూస్తే మరుగున ఉన్న మహానుభావులు చాలామందే ఉంటారు.

గాడ్సె ప్రత్యక్షంగా గాంధీని హత్య చేసాడు, కాబట్టి నేరస్తుడే. ముస్లీములు పాకిస్తాన్ గా విడిపోయిన తర్వాత, ఆ పాకిస్తాన్ కు ఆర్ధిక సహాయం చేయాలని నిరాహార దీక్ష చేసిన బాపూజీ – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల ఉరిశిక్షను ఆపివేయటానికి ఎటువంటి దీక్షలు ఎందుకు చేయలేదు? వారి మరణానికి పరోక్షంగా కారకుడైన గాంధీ, గాడ్సే కన్నా ఎలా గొప్పవాడు?

*********

Why I Killed the Mahatma: UNCOVERING GODSE’S DEFENCE

హిందు మతోన్మాదిగా భావించబడే గాడ్సే చేతుల్లో హత్య గావించబడ్డ గాంధీకి, సిక్కు సైనికుని చేతుల్లో హత్య చేయబడ్డ ఇందిరాగాంధీకి, తమిళ టైగర్సు చేతుల్లో చంపబడ్డ రాజీవ్ గాంధీకీ తేడా ఏమీ లేదు. వారు చేసిన రాజకీయాలకు వాళ్ళు బలయ్యారు కానీ, త్యాగం ఏమాత్రమూ కాదు.

మనం నేర్చుకున్న చరిత్ర పాఠాలు, ఎవరి త్యాగం ఏమాత్రమనేది తులనాత్మకంగా చెప్పదు. చెప్పలేదు కూడా. వారి పోరాట పంథాలో స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల త్యాగాలు, గాంధీ నెహ్రూల త్యాగాల కన్నా భిన్నమా? అహింసాయుత పోరాటంలో కూడా అసువులు బాసిన వేలాది ప్రజల త్యాగం గాంధీ నెహ్రూల త్యాగం కన్నా తక్కువా?

రెండు మూడేళ్ళ క్రితం అప్పటి కేంద్ర మంత్రిగా పనిచేసిన మణిశంకర్ అయ్యర్ అండమాన్ లోని సెల్యులర్ జైలుకు వెళ్ళటం తటస్థించింది. అక్కడి జైలులో వీర్ సావర్కర్ చిత్రపటం చూసి అగ్గి మీద గుగ్గిలం అయ్యి, తన చేతులతో తీసి అవతల పారేసాడు (లిటరల్ గా). జీవితంలో ముఖ్యమైన సమయాన్ని – దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా ఆ జైలులో గడిపిన స్వాతంత్ర్య సమరయోధుడి త్యాగం గాంధీ నెహ్రూల త్యాగానికి తీసిపోయిందనా వాడు ఆ పటాన్ని తీసి పారేసాడు? సావర్కర్ తో పోలిస్తే, గాంధీ నెహ్రూలు తమ పోరాటంలో భాగంగా ఎంతకాలం జైలు జీవితం గడిపారు?

**********

Nathuram Godse: The Hidden Untold Truth

ఇవి కేవలం అభిప్రాయ బేధాలుగా మాత్రమే పరిగణించి కొట్టేస్తాం. మన దేశం, మన స్వాతంత్ర్యం కొందరి పోరాటఫలమనే చరిత్ర పాఠాలు చదివిన తర్వాత అవి అభిప్రాయ బేధాలుగా మాత్రమే కనిపిస్తాయి కానీ, నిజాలు మాత్రం కావు. కేవలం హిందువులు, హిందు మతాభిమానులనే కారణంతో, ఎన్నెన్నో త్యాగాలు చేసిన చాలామంది యోధులు మన చరిత్రపుటల్లో కనీస మాత్రంగానైనా ప్రస్తావించబడకపోవటం ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు చరిత్రకారుల కుట్రలలో భాగమే.

కాబట్టి చరిత్ర పేరుతో వీళ్ళు మన కళ్ళకు కట్టిన గంతలు తొలగించి నిష్పక్షపాతంగా వారివారి చరిత్రలు తెలుసుకొని అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. కోర్టులో నాధూరాం గాడ్సె ఇచ్చిన చివరి ఉపన్యాసం ఈక్రింది లింకులో చదవండి.