ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శ్రమైక జీవన సౌందర్యం

Like-o-Meter
[Total: 0 Average: 0]

లేస్తూనే గడియారం వంక చూసి “అప్పుడే ఏడు అయిపోయిందా!” అని నిట్టూర్చి మంచం దిగాడు శంకరం. 

ఆరు రోజులు పనిచేస్తే ఒక రోజు సెలవు. ఈ ఆరు రోజులూ  ఉదయం ఏడున్నరకు బయలుదేరి మరల రాత్రి డున్నరకో లేదా ఎనిమిదింటికో ఇంటికి చేరడం రివాజు అయిపొయింది శంకరం జీవితంలో.

ఆదరాబాదారాగా తయారై ఆఫీసు చేరాడు శంకరం. ఆఫీసులు కొత్తగా వచ్చిన ఒక అమెరికన్ శంకరాన్ని కలవడానికి మీటింగ్ రూంలో కూర్చున్నాడని కొలీగ్ చెబితే మీటింగ్ రూం కి వెళ్ళాడు. ఈమధ్యనే శంకరం పని చేసి సంస్థను ఒక అమెరికన్ సంస్థ కొనుగోలు చేసింది.  ఆ అమెరికన్ ఎవరో గాని చాల విశాల దృక్ఫదం ఉన్నవాడు.

“ఈ వారం నుంచే ఐదు రోజుల పని దినాలని మనం ప్రవేశపెడుతున్నాం” అని ఇంగ్లీష్ లో చెప్పగానే శంకరానికి ఎగిరి గంతెయ్యాలని అనిపించింది. ఇంతలో ఆ అమెరికన్ “మన ఉత్పత్తి సంస్థలలో కూడా ఎక్కడ ఇరవై నాలుగు గంటలు నడవాలి అనే అవసరం లేదో అక్కడ కూడా మనం ఐదు రోజుల పని దినాలని ప్రవేశ పెడుతున్నాం” అని చెప్పాడు.
 
శంకరానికి ప్లాంటులో పని చేస్తున్న అమిత్ గురుతుకు వచ్చి చాల సంతోషమేసింది.  అమిత్ చాల తెలివైనవాడు. తను ఎప్పుడూ టైంకు వచ్చి టైంకు వెళ్లి పోతాడు. అది వాళ్ళ బాస్ కి నచ్చదు. కాని పనిలో చాల నిబద్ధత ఉన్న వాడు కనుక అతన్ని ఏమి అనలేరు. కాని ఈ ఖచ్చితత్వం వల్ల అతనికి రావలసిన ప్రొమోషన్ రాకుండా పోయింది. అందువల్ల వేరే ఉద్యోగం చూసుకుంటున్నాడు. మొన్ననే అన్నాడు “నాకు ఐదు రోజుల పని దినాలు ఉండే సంస్థలో ఉద్యోగం చేయాలని ఉంది” అని.

మొత్తం సంస్థను ఈ అమెరికన్లు ప్రక్షాళనం చేస్తున్నారు. ఇది చాల ఆనందంగా ఉంది అందరకూ. మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే అమిత్ కి ఫోన్ చేసాడు. అమిత్ కి అప్పటికే వాళ్ళ ప్లాంట్ హెడ్ ద్వారా విషయం తెల్సింది శంకరం ఫోను అందుకోగానే తనే శంకరానికి శుభాకాంక్షలు చెప్పాడు.

 
“ఒరేయ్ శంకరం! ఇరవై ఏళ్ల ఈ సంస్థలో పనిచేస్తున్న వాళ్లకి ఇది నిజం గా ఒక పెనుమార్పే. పైగా ఇరవై ఏళ్ళగా ఒకే విధంగా పని చేయడానికి అలవాటు పడ్డ వాళ్లకు ఇది ఒక ఊహించని మార్పు. మొన్న ఇక్కడి కార్మిక సంఘం చాల సంతోషం గా యాజమాన్యం చేసిన ప్రతిపాదనలను ఒప్పుకుంది. ముందు కొంత అనుమానం ఉన్న వాళ్ళ అనుమానాలన్నీ పటాపంచలైయ్యే లాగ మన కొత్త మేనేజర్ చెప్పడంతో కేవలం అరగంటలో ఒప్పందం కుదిరిపోయింది.”
 
ఇహ ఆశ్చర్య పోవడం శంకరం వంతయింది. “ఎమైతేనే ఇది ఒక మంచి మార్పు” అని శంకరం అన్నాడు.

ఇద్దరూ వాళ్ళ కష్టాలను తలచుకొని ఈ మార్పును మరింత స్వాగతించారు.
 
“ఈ మార్పుల వల్ల వ్యాపారం ఇలా కూడా చేయవచ్చు అని ఇక్కడున్న ఇతర కంపెనీలకు తెలుస్తుంది. కేవలం చట్టాలను, నియమాలను ఉల్లంఘించడం ద్వారానే మనం వ్యాపారం చేయగలం అనుకోవడం చాల పొరపాటు. ఎందుకంటే ఆ విధానం ఆ చట్టాలను అలానే ఉంచడానికి దోహద పడుతుంది. కాని వాటిని ప్రగతి పథంలో మార్చడానికి దోహద పడదు. మరోపక్క భ్రష్టాచారాన్ని పెంచి పోషిస్తుంది. మనం భయపడినట్లు ఈ అమెరికన్లు దోచుకోవడానికి రాలేదు. మన ప్రగతికి దోహద పడడానికి వచ్చారని అనిపిస్తుంది రా!” అని అమిత్ చెప్పాడు
 
“రోజులో పన్నెండు గంటలు కేవలం ఉద్యోగార్థం కాలం వెచ్చించి ఆ లెక్కన మొత్తం వారంలో ఆరు రోజులు కేవలం రాత్రి కాలం మాత్రం కుటుంబంతో గడిపే జీవిన విధానం ఇప్పటికీ మన ఉత్పత్తి రంగంలో ఉంది.  మన దేశంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ఐ. టి ఉద్యోగులు మినహా మిగిలిన వారికి ఆరు రోజుల పనే. కొన్ని సంస్థల్లో అయితే వాటి నిర్వాహకులు ఎవరు పనికి ముందుగా వచ్చి ఆలస్యంగా ఇంటికి వెళతారో వారే పనిచేసే వాళ్ళుగా పరిగణించడంతో చాల మంది అటువంటి నిర్వాహకుల మెప్పు పొందడానికి అహర్నిశలు పాటు పడి  వారికంటూ ఒక పరివారముందని మరచిపోతారు. కేవలం పని, మెప్పు, సంపాదన పరమావధిగా జీవనం సాగించే కొద్దిమంది వల్ల ఈ వ్యవస్థ ఇలానే ఉండిపోయింది.  మనం ఐదు పని దినాలలో ఆరు పనిదినాల ఉత్పాదకతను సాధించ గలిగినపుడు మనం ప్రత్యక్షంగా ఆరవ రోజు సెలవు కనుక ఆ మేరకు మన పెట్రోల్, మన కంపెనీ నిర్వహణ ఖర్చులు, ఇంధనం, ఎంతో ఆదా చేస్తున్నాము. పైగా మనకు ఆ రోజు మన పనిముట్లని వాడనందుకు వాటి అరుగు తరుగు కూడా ఉండదు. సమాజపరంగా ఆలోచిస్తే మనం ట్రాఫిక్ రద్దీని, ధ్వని, వాతావరణ కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాము.  ఇలా వారానికి రెండు రోజులు సెలవు రావడం వల్ల ఉద్యోగులలో, వారి కుటుంబాలలో మొత్తం సమాజంలో పీడన తగ్గి శాంతి నెలకొంటుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి సమాజంలో సానుకూలత పెరుగుతుంది.  మన యువతకు ఇప్పటి ఐ. టి. కంపెనీ లు ఐదు రోజుల పని దినాలు ఇవ్వడం వలెనే కదా ఈ యువత ఐ. టి రంగం వైపు మోజు చూపు చున్నది.  మనం ఐ. టి. రంగాన్ని చూసి నేర్చుకున్నది ఏమీ లేదు సరిగదా అది మనకు సాధ్యం కాదు అనే ఒక ఖరారైన నిర్ణయానికి వచ్చేసాము. ఎందుకు మనకూ (ఐ. టి. యేతర సంస్థలకు) సాధ్యం కాదు అనే ధోరణి రానే రాదు. ఇది సాధ్యం కాదు అనేది ఒక పిడి వాదం ఒక తిరోగమన సిద్ధాంతం.”  తన మనసులో ఎన్నాళ్ళు గానో ఉన్న విషయాన్ని అమిత్ కు చెప్పాడు శంకరం.
 
“నిజమే రా శంకరం! సత్యం కంపెనీ మేటాస్ ను పెట్టి నపుడు మేటాస్ లో కూడా ఐ. టి కంపెనీ విధివిధానాలనే ప్రవేశపెట్టారు. టాటాలు మౌలిక రంగంలో వచ్చినపుడు వాళ్ళూ వాళ్ళ విధివిధానాలు మార్చలేదు. ఒక మౌలిక రంగంలో ఉన్న కనస్ట్రక్షన్ కంపెనీ ఒక ఐ.టి. కంపెనీ లాగ పనిచేయగలదు అని ఒక విధంగా నిరూపించారు. అందుకు తార్కాణం రెండో, నాలుగో శనివారాలు సెలవు. ఇది సాధ్యం అని మనకు తెలుస్తుంది కదా?  అలాగే నాకు తెలిసిన మన దేశంలో ఉన్న మన దేశీయ  ఉత్పత్తి సంస్థ తన తయారీ పనిని ఐదు రోజులకు పరిమితం చేసి తద్వారా ఎన్నో లాభాలు పొందింది.  ఎక్కడ సత్సంకల్పం ఉంటుందో అక్కడ ఏదైనా తప్పక సాధ్యం ఔతుంది.  మనం భారతీయులమై ఉండి తోటి భారతీయున్ని మనం బ్రిటిష్ వాళ్ళలా చూడడం మన భారత జాతికే సిగ్గు చేటైన విషయం.  మన పిల్లలు యూరోపియన్ అమెరికన్లలా జీవితాలు గడపాలి మన సంస్థలలో మనతో పని చేసి వాళ్ళు స్థితిగతులు మారకూడదు?  ఇదేమి చిత్రం. మన వ్యాపార సంస్థలు వాటి యజమానులు ఇంకా సంకుచిత నిర్వహణా రీతులనే ఎంచుకుంటారు కాని ప్రగతి దారిన పయనించడానికి ఒప్పుకోరు.  ఎందుకంటే మన మనస్సులో ఎక్కడో ఇతరులు బాగుండకూడదు అనే భావన నాటుకుపోయింది. తయారి రంగంలో ఉన్న సంస్థలు గాడిదల్లా పనిచేయాలి ఇది మనకు మనం పెట్టుకున్న నిబంధన  హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి అని మేనేజ్మెంట్ నిపుణులు గొంతు చించుకున్న మనం మారం.  ప్రపంచంలో ప్రగతి కొనసాగుతుంటే మన దేశం లో ప్రగతి ముఖ్యంగా తయారి రంగంలో కుంటుపడడానికి కారణం మన చట్టాలు, మన సంకుచిత బుద్ధులు.”  అమిత్ గుక్క తిప్పుకో కుండా చెప్పాడు. 
 
అంతలో ఎక్కడినుంచో వచ్చాడు రఘు. “నేను నా రాజీనామాను వాపస్ తీసుకుంటున్నాను! నాకు ఈ సంస్థలోనే పని చేయాలని ఉంది” అని చాల సంతోషంగా వచ్చి చెప్పాడు. “ప్రగతి” లో పనిచేస్తున్న ఉద్యోగులలో నిద్రాణంగా ఉన్న ఆశ ఒక్కసారి చిగురు తొడిగి ఒకేసారి వటవృక్షమైనట్లు ఉంది. పక్కన ఉన్న పరిశ్రమలలో ప్రగతి లో ప్రవేశ పెట్టిన మార్పుల గురించే చర్చ. పైగా అమెరికన్లు ప్రగతి పేరును కూడా మార్చకుండా అలానే ఉంచడం ఒక విశేషం ఇది ఇతర యాజమన్యాలలోఒక పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వ శాఖలలో కూడా  చర్చ, వాళ్ళ లంచాలకు గండి పడే రోజులు నిజంగా వస్తాయా అని. ఉళ్ళో ఉన్న మేనజ్మేంట్ కాలేజీలు ఒక పెద్ద అంశం దొరికిందని చాల కేసు స్టడీలు వ్రాసేసుకున్నై! ఏవి ఎలా అనుకుంటున్నా ఏమీ ప
ట్టించుకోకుండా శంకరం కంపెనీ “ప్రగతి” లో ప్రగతి కొనసాగిపోతోంది
 
సంస్థలో సృజనాత్మక మైన నిర్ణయాలు జరుగు చున్నాయి వాటి ఫలితం గా ఉత్పాదకత, పనిలో సౌలభ్యం పెరుగు చున్నాయి. బృందాలు సమిష్టి శక్తులుగా మారి అంతర్గత ఆరోగ్యమైన స్పర్ధ పెరిగి ఉద్యోగులే మార్పుకు సాధనాలై ప్రగతి ఎవరూ ఊహించని ప్రగతిని ప్రదర్శిస్తోంది !!

మొదట పాత పద్ధతిలో ఉన్న చాల మంది సీనియర్ ఉద్యోగులు అధికారులు సైతం ఈ మార్పును అక్కున చేర్చుకున్నారు – మొదట మనుగడ కోసం పిదప సంతోషంతో. ఇంతలో అక్కడే ఉన్న మాధవ రావు అమిత్ దగ్గరకు వచ్చి “నీతో మాట్లాడాలి  ఒక సారి నా కాబిన్ కు వస్తావా” అని చెప్పి ఆయన కాబిన్ వైపుకు వెళ్లి పోయాడు. మాధవ రావు అక్కడ ఒక ఉన్నత అధికారి మార్కెటింగ్ విభాగానికి అధిపతి. అమిత్ వెంటనే ఆయనను అనుసరించాడు.

* * * * * *
 
 
“అమిత్ నాకు ఇప్పుడు తెలిసింది నేను నిన్ను మన టీం లో ఉన్న ఇతర సభ్యులని ఎంతో బాధకు గురిచేసాను.  మీరు నా వల్ల పడ్డ యాతన కేవలం ఊహించుకుంటేనే నా మీద నాకు అసహ్యం కలుగు తుంది.  నేను మీ అందరకు రేపు ఓపెన్ గా క్షమాపణ చెబుతాను. దీనికోసం ఒక ప్రత్యేకమైన మీటింగ్ నేను ఏర్పాటు చేసినట్లు మెయిల్ పంపా. నీకు అంది ఉంటుంది తప్పక రా.  నిన్ను ప్రత్యేకం గా ఇలా పిలవడానికి కారణం ఒకటే నువ్వు ఇచ్చిన ఐడియా లతో నేను చాల సార్లు మన ఎం డి నుంచి మెప్పు పొందాను. ఒక్క సారి కూడా అవి నీవు ఇచ్చిన ఐడియా లు అని చెప్పలేదు.  ఇది నాకు చాల మనః క్షోభను కలిగిస్తుంది.  నేను ఇందుకోసం ఈ సాయంత్రం మన ఎం. డి గారిని టైం అడిగాను. ఆఫీసు నుంచి నువ్వు నేరుగా ఎం. డి ఆఫీసుకు వచ్చై.  నువ్వు తప్పక రావాలి మారు మాట్లాడకు. ప్లీజ్” అని చెప్పి ఒక్క సారిగా ఎప్పుడూ లేని విధం గా అమిత్ ని తన అక్కున
చేర్చుకున్నాడు.  నాకు ఒక తమ్ముడు ఉంటె నీలాగే ఉన్దేవాదేమో అని.  అమిత్ ఈ చర్యకు అచ్చెరువొంది. తేరుకొనే లోగా మాధవ రావు సెల్ మోగింది. “అమిత్ మనం సాయంత్రం ఎం.డి ఆఫీసు లో కలుద్దాం” అని చెప్పి ఫోన్ తీసుకున్నాడు.
అమిత్ నిశ్శబ్దం గా బయటకు వచ్చి ప్రశాంతంగా ఊపిరి పీల్చు కున్నాడు.
ఒక్క మార్పు ఎన్ని మార్పులకు కారణమైందో కదా అని.
 
***
ఎం డి ఆఫీసు:
రా అమిత్ అంటూ ఎం.డి అమిత్ ను లోనికి ఆహ్వానించాడు.
అప్పటికే మాధవ రావు వచ్చి ఉన్నాడు.
అమిత్ రాగానే మాధవ రావు లేచి. 
“ఎం. డీ గారు మీకు ఒక ముఖ్య మైన విషయం చెప్పాలి అంతకు ముందు మీ సాక్షిగా నేను ఒక పని చేయాలి మీరు కొంచం నాకు టైం ఇవ్వండి”
ఓకే గో ఎహేడ్ అని ఎం డీ అన్నాడు
మాధవ రావు అమిత్ ను ఒక్క సారి లేచి తన ముందుకు రామ్మన్నగా అమిత్ వచ్చి మాధవ రావు ముందు వినయంగా నుంచున్నాడు.
ఒక్క సారిగా మాధవ రావు వంగి అమిత్ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు అని అడిగాడు.
ఊహించని ఈ హటాత్ పరిణామానికి అమిత్, ఎం డీ కూడా నిశ్చేష్టులయ్యారు
వారు వర్తమానంలోకి వచ్చే లోపున మాధవ రావు “నాకు తెలుసు మీకు ఇది కొంచం వింతగా తోచవచ్చు కాని ఇంతకూ మించిన దారి నాకు దొరకలేదు. నేను అమిత్ ఇచ్చిన ఎన్నో ఐడియా లను కాపి కొట్టి వాటిని స్వల్పంగా మార్చి మీకు చెబితే వాటిని మీరు ఎంతో మెచ్చుకొని నన్ను ఇంతగా ఆదరించారు నేను మాత్రం. కనీసం అమిత్ కు రావలసిన కనీసపు గుర్తింపును కూడా ఇవ్వకుండా పైగా ఒక రెబెల్ గా అతన్ని చిత్రించి మిగతావారికి ఆఖరికి మీకు కూడా చాల వ్యతిరేకం గా చెప్పను అందుకు మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను సంతోషం గా స్వీకరిస్తాను ఆ శిక్ష అనుభవించి ఆపై నేను నా పదవికి రాజీనామా చేస్తాను” అని చాల గంభీరం గా చెప్పాడు.
ఎం. డీ ఈ మార్పుకు చాల ఆనందించి వెంటనే అమిత్ తో కరచాలనం చేసి “ఇన్ని జరిగినా అమిత్ ఒక్క సారి కూడా నా దగ్గరకు వచ్చి ఏ ఫిర్యాదు చేయలేదు. ఒక సారి కూడా నన్ను కలవడానికి ప్రయత్నిచలేదు నాకు ఆశ్చర్యంగా ఉంది”
 
అప్పుడు అమిత్ ” సర్ నేను ఒకే విషయానికి సంతోష పడ్డాను ఎందుకంటే నా ఆలోచనలు మంచివని ఆచరణ యోగ్యమని మాధవ రావు గారి పనుల ద్వారా తెలుసు కున్నాను అలాగే నేను ఆయనకు ఐడియా లు ఇవ్వడం మానలేదు ఎందుకంటే వాటి వల్ల సంస్థకు మన వినియోగదారులకు మంచి జరుగుతుంది కనుక.  పైగా మా నాన్న గారు ఒక మాట చెప్పారు “మంచి ఏనాటికైనా గుర్తింపు పొందుతుంది” అని అది నిజమైంది.   మన ప్రగతి సంస్థను అమెరికన్లు కొన్నాక నేను మార్పు ఊహించాను కాని ఇలాంటి మార్పును కాదు. మా ఉద్యోగులంతా అచ్చెరువొందే రీతిన ఆ రాబర్ట్ చైర్మన్ గా ఉంది మీ ద్వారా ఇన్ని మంచి మార్పులు తీసుకొని రావడం చాల ఆనందం కలిగించింది”.
 
“ఔను అమిత్ “నేను సైతం” అనే రీతిన నేను కూడా ఈ మాధవ రావు గుంపులో వాడినే కాని రాబర్ట్ నన్ను మొదట కలసి నపుడు అన్నా మాటలు నన్ను మార్చేశాయి. ఆయన ఒక మాట అన్నాడు ” వ్యాపారం లో వృద్ది మన సిస్టమ్స్ ద్వారా, మన టెక్నాలజీ ద్వారా లేదా మన పని పద్ధతుల ద్వారా రాదు కేవలం మనదగ్గరుంది మన కోసం పని చేస్తున్న మనుషుల ద్వారా వస్తుంది”  ఈ వ్యాపార సూత్రం నగ్న సత్యం అయినా దీనిని త్యజించి పాత పద్దతుల్లో కొత్త రీతిన మనుషులను వాడుకోవడం ఇప్పుడు జరుగు చున్న పని  మేము ఈ సంస్థను కొన్నది ఒక కొత్త వ్యాపార సిద్ధాంతాన్ని ఆవిష్కరించడానికి తద్వారా మేము ఈ వ్యాపార ప్రపంచానికి ఇది సాధ్యం అని రుజువు చేయడానికి. మీరు మనస్పూర్తిగా సహకరిస్తే మీరు ఎం. డీ గా కొనసాగా వచ్చు అలాగే ఎవరు మీలా సహకరిస్తారో వారు వారి విధుల్లో కొనసాగా వచ్చు” అని  భరోసా ఇచ్చాడు.
 
ఇంకొక మాట కూడా చెప్పాడు “లాభాలు లోభత్వం తో రావు, విశాల దృక్పధం తో అధికంగా వస్తాయి, చట్టాన్ని గౌరవించి అడ్డ దారులు తొక్క కుండా మనం అధిక లాభాలు పొందవచ్చు ఇది మనం నిరూపించాలి”  మన సంస్థకు పరిమితులు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్సాహం చూపాలి అందుకోసం మనం నూతన రీతిన పని చేయాలి మన ఉత్పత్తులను ఒక సారి బేరీజు వేసుకోవాలి మన వ్యాపార దృక్పధం మారాలి” అని చెప్పాడు.
 
ఇది సాధ్యం అని ఇప్పుడు రుజువైంది.  మీ ఇద్దరకూ నా ధన్యవాదాలు.

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>