ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అధ్యాయం 14 – పల్నాటి వీరభారతం

Like-o-Meter
[Total: 1 Average: 4]

విజయాన్ని సాధించి తిరిగివచ్చిన బ్రహ్మనాయుడికి అఖండమైన స్వాగతాలతో విజయగీతికలు పాడుతూ మాచెర్ల ప్రభువు, మలిదేవుడితో సహా, ప్రజలూ – ప్రముఖులంతా ఎదురు వచ్చారు.

బ్రహ్మనాయుడు చిరునవ్వుతో నగరప్రవేశం చేసాడు.

మరునాడు ఉదయం మలిదేవుడు కొలువుదీర్చి, ప్రముఖులతో కూర్చున్నవేళ బ్రహ్మనాయుడు విచ్చేసి తన స్థానంలో గంభీరంగా కూర్చున్నాడు.

“యుద్ధవార్తలు వినిపించండి మహామంత్రీ” అన్నాడు మలిదేవుడు.

బ్రహ్మనాయుడు క్షణం తాళి…

“నాశనమైపోయేవరకూ కురు యువరాజు దుర్యోధనుడు పాండవులను అదును దొరికినప్పుడల్లా, కష్టాలపాల్జేసాడు. ఇవ్వాళ నలగాముని పరిస్థితి అదే. శకునివంటి నాగమ్మ నాటిన విషవృక్షం శాఖోపశాఖలతో విస్తరించిపోయింది. ఆ విషవృక్షచ్ఛాయన సేదతీర్చుకుంటున్న నలగాముడికి గుండెల నిండా విషపుగాలి నిండివుంది.

మతాలను అడ్డుపెట్టుకుని – గొప్ప ఆటగాడిచేతిలోని తోలుబొమ్మలాగా, నలాముణ్ణి ఆడిస్తున్నది నాగమ్మ. మన మధ్య అగాధాలు పెరిగినవి. దాయాదులను ఏవిధంగా హతమార్చాలా అని, నాగమ్మా-నలగాముడూ ఆలోచిస్తున్నారు. మండాది మనకు అనుకున్నంతగా అచ్చిరాలేదు. ఇప్పుడు ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి – తప్పదు.”

“ఎక్కడికి మహామంత్రీ?”

“మేడపి”

“ఇది తక్షణ కర్తవ్యమా?”

“ఔను”

“అట్లాగే”

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

*****

మలిదేవాదులు తమ ప్రజలతో మేడపిని చేరుకున్నారు. ప్రకృతి పక్షపాతం చూపించిన ఈ మేడపి అందాలకు నిలయం. కానీ చిన్న పల్లె.

తమ కాల్బలంతో, అశ్వాలతో, వీరులతో రెండవ రోజు ప్రొద్దు వాటారుతున్న వేళకు మేడపి చేరుకున్నారు.

రాజులు తల్చుకుంటే దేనికి కొదవ?

మరో పట్టణాన్ని ఏర్పరిచాడు బ్రహ్మనాయుడు. కోటలు – దానితో బాటు పేటలు – పేటలకు బాటలు. అన్నీ తయారయ్యాయి. మేడపి ఇప్పుడు వయసొచ్చిన సొగసుకత్తెలాగా, అందాలతో విరగపడిపోతున్నది.

ఇప్పుడది మేడపి పల్లె కాదు. అందమైన పట్టణం.

నిమ్మకు నీరెత్తినట్లు సుఖజీవనం గడుపుతున్నారు పలనాటి ప్రజలు.

*****

కాలపు సెలయేరు జరజరా పాకుతూ సంవత్సరాలను తనలో కలుపుకుంటూ పోతున్నది. మానవ జీవితంతో పెనవేసుకుపోయిన కాలానిది ఎప్పుడూ అద్భుతమైన పాత్రే.

ఏడేళ్ళను మింగింది కాలం.

అరణ్యవాసం ఆఖరిరోజు కూడా అయిపోయింది. ఇవ్వాళ నూతనకాంతులతో బాలభానుడు విజయగర్వంతో తూర్పుదిక్కున నిప్పుకత్తులు నూరుతున్నాడు.

“అరణ్యవాసం అయిపోయింది” అనుకున్నాడు బ్రహ్మన్న.

మేడపిలో జీవితం సుఖంగా సాగుతున్నదిగనుక “మాకు మళ్ళీ మాచెర్ల అక్కర్లేదు” అనుకున్నాడు మలిదేవుడు.

మలిదేవుడు హెచ్చరించలేదు గనుక కొంతకాలం తటస్థంగా ఉండిపోయాడు బ్రహ్మన్న.

మరో అర్ధసంవత్సరం గడిచిపోయింది.

**********

“అది కాదు!”

“నాయనా! మలిదేవా! గురజాల ప్రభువు నుండి మనం కుక్షి నింపుకోవటం కోసం తృణకణాలను కోరుకోవటం లేదు. ధర్మంగా రావలసినదాన్ని అడుగుతున్నాం. ఎంతకాలం ఈ మేడపిలో మన బ్రతుకు? గుత్తరాజ్యాలతో తనది లేని ఈ బ్రతుకు ఎంత హేయమైనదో ఆలోచిస్తే నాకు నిద్ర రావడం లేదు”

క్షణమాగి –

“కాలం ఎప్పుడూ ఒక్కర్నే కనికరించదు. కాలం కాటందిన పాండవులు పరుల పంచలో గడిపిన దుర్భరమైన జీవితాన్ని ఊహించు. దుర్యోధనుడు నశించాడు. మనకి రావలసినది నలగాముడే ఇస్తే మంచిది. అధవా ఇవ్వడూ – బలాబలాలు తేల్చుకుంటాము”

“కానీ…”

“మారణహోమమంటావా? రాజులు యుద్ధాలు చెయ్యాలి. రాజ్యాన్ని పరిరక్షించాలి. తనది నిలుపుకోవాలి” తన రాజ్యాన్ని కోరుకోలేని – లేదూ – నిలుపుకోలేని రాజు నిమిత్తమాత్రుడైన యజమానే కాని నిజమైన ప్రభువు కాలేడు. ప్రజారంజకం చేయాల్సిన పరిపాలనలో తాత్కాలిక కష్టాలే భవిష్యత్ సుఖాలకు సోపానాలు.”

“ఐతే..ప్రస్తుత కర్తవ్యం..రాయబారమేనా!”

“అవును, మానవులుగా మనం చేయాల్సిన బాధ్య ఇతి. రేపటి విధి మీద ఇవ్వాల్టి “భూతం” ఆధారపడి వున్నది.”

“మీ ఇష్టం” అన్నాడు మలిదేవుడు.

*****

సశేషం…