ఒక చమత్కార శ్లోకం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మన సాహిత్యాన్ని అనేకానేక చమత్కార శ్లోకాలు, పద్యాలు హాస్య స్ఫూర్తిని నింపి పరిపుష్ఠము చేసినాయి. ఈ శ్లోకములోని చమత్కారాన్ని గమనించండి.

“భిక్షార్ధీ స క్వయాతః?

“బలి ముఖే!”

“తాండవం క్వాద్యభద్రే?”

“మన్యే బృందా వనాంతే!”

“క్వను స మృగ శిశుః?”

“నైవ జానే వరాహం?”

“బాలే క్వచ్చిన్న దృష్టః జరఠ వృషపతిః “

“గోపే వాస్య వేత్త.”

లీలా సంలాప ఇత్థమ్ జలనిధి, హిమవత్కన్యయోత్రాయతాంవః.”

శ్రీ లక్ష్మీ దేవి, పార్వతీదేవి స్నేహపూరితంగానే మేలమాడుకుంటున్నారు.

లక్ష్మి: “ఆ బిచ్చగాడు ఏవీధికి వెళ్ళెనో?” (నీ భర్త బిక్షాటన చేసేవాడు అని వ్యంగ్యం)

పార్వతి: “బలి చక్రవర్తి సముఖానికి.” (వామన మూర్తి గా వెళ్ళి మూడడుగుల నేలను దానం ఇవ్వమని అడిగినది శ్రీ మహా విష్ణు మూర్తి కదా)

లక్ష్మి: “అతను తాండవం చేస్తూ, ఎక్కడ తైతక్కలాడుతున్నాడో?”

పార్వతి:“బృందావనంలో, ఏదో మూల.”(రాసక్రీడలు ఆడేది నీ భర్తయే కదా అని దెప్పి పొడుపు ఇది.)

లక్ష్మి: “ఆ జంతువు పిల్ల (గణపతి)ఎక్కడ ఉన్నది?”

పార్వతి: “ఆ పంది పిల్ల ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు?(వరాహావతారం దాల్చినది నీ పతియే!”)

లక్ష్మి: “బక్క చీ చిక్కిన ఎద్దు ఏదీ?”

పార్వతి: “ఎద్దు సంగతి మనకేమి తెలుస్తుంది, వదినా!ఆవుల్ని కాచే వాళ్ళకు తప్ప.”

శ్లోకకర్త వసుధైక కుటుంబము అనే సూక్తిని ముక్తాయింపుగా ఇంపుగా ఇచ్చిన వైనం ఇది ఈరీతిగా అలరించే సాగర పుత్రిక, గిరి పుత్రికల విలాసవంతమైన లీలా సల్లాపములు మనలను రక్షించు గాక!”

Your views are valuable to us!