కె సెరా సెరా పాట – మన భానుమతి

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 3.5]

కే సెరా సెరా….” అనే ఒక ఇంగ్లీషు పాట మన తెలుగు సినిమాలో ఉంది తెలుసా?

ఆ పాట పాడింది మరెవరో కాదు “అత్తగారి కథలు” రచయిత్రి, విదుషీమణి, గాయని, మన తెలుగింటి మణిదీపం, నటీమణి, సకల కళాభినేత్రి శ్రీమతి పి.భానుమతి.

“తోడూ  నీడా” అన్న సినిమాలో చిన్నపాపను సముదాయించడానికి ప్రయాసపడే ఇల్లాలి పాత్రలో “శభాష్” అనిపించుకున్నది ఆమె. 

పసిపిల్లను సముదాయించే క్రమంలో భానుమతి “కే సెరా సెరా” అంటూ పాడుతుంది. దానికి చిన్నారి “ఛి ఛీ బాలేదు” అంటుంది. వెంటనే అన్నమయ్య కృతి “జో అచ్యుతానంద జోజో ముకుందా! లాలి పరమానంద రామ గోవిందా!” ని ఆలపించింది.

 

“కె సెరా సెరా” అంటూ సాగే ఆ ఇంగ్లీష్ గీతం గురించి మరికొన్ని ఆసక్తికరమైన వివరాలను చూద్దామా! 

 

 

*********

కె సెరా సెరా – ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్

ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అనగానే  సస్పెన్స్ సినిమాలకు మారుపేరు. హిచ్ కాక్ నిర్మించి, దర్శకత్వం వహించిన హారర్ ఫిల్మ్ The Man Who Knew Too Much లో ఈ “కే సెరా సెరా” పాట ఉంది. ఈ సినిమా ఇంటెర్నేషనల్ కుట్రలో ఇరుక్కున్న దంపతుల కథ.

ఈ సినిమాలో కథానాయిక ‘డోరిస్ డే’ ఒక విశాలమైన పెద్ద హాలులో పియానోని వాయిస్తూ  పాడుతుంది. ఒక్క డైలాగు లేకుండా సాగే ఆ సన్నివేశాన్ని వందకు పైగా కెమేరాలతో ఒకేసారి చిత్రీకరించారంట.

*********

ఇక కె సెరా సెరా పాట పుట్టుపూర్వోత్తరాలను చూద్దాం.

“కే సెరా సెరా” (Que Sera, Sera) అనేది ఇటాలియన్ భాషలోని ఓ వాక్యం. ఇంగ్లీషులోకి అనువదిస్తే “వాటెవర్ విల్ బి, విల్ బి” అంటూ (Whatever will be, will be) అనే అర్థం వస్తుంది.

*********

కె సెరా సెరా ఇంగ్లీష్ వర్షన్

Jay Livingston అమెరికాలోని  పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్ బర్గ్ పట్టణంలో పియానో నేర్చుకున్నాడు.  

మంచి సంగీత విద్వాంసునిగా త్వరలోనే పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో సినీ గీతాలు, ప్రైవేట్ ఆల్బములకు బాణీలను కూర్చాడు. రే ఇవాన్స్ పాటలు రాస్తే, జే లివింగ్ స్టోన్ బాణీలను సమకూర్చేవాడు. 

ఇవాన్స్ & జే లివింగ్‍స్టోన్ – వీరు ఇద్దరి జంట నేతృత్వం లో వెలువడిన పాటలు ఎన్నో అనేక అవార్డులను గెలుచుకున్నాయి. వీరిద్దరి జంట సృష్టే – కే సెరా సెరా అన్న ఇటాలియన్ మాటలతో సాగే ఇంగ్లీష్ పాట. ఈ పాట ప్రపంచ సంగీతానికి కొత్త వరుసలను అందించింది. కొత్త పుంతలను తొక్కేలా చేసింది.

‘కే సెరా సెరా’ పాటకు బెర్నార్డ్ హెర్ మ్యాన్ (Bernard Hermann) ఆర్కెస్ట్రాను అరేంజ్ చేసి, నిర్వహించాడు.

*********

ఈ ‘Que Sera, Sera’ పాట ఏమిటి? ఇందులోని మాటలకు అర్థాలు ఏమిటి? అన్నది చూద్దాం.

అనేక అవార్డులను పొందిన Que Sera, Sera పాటలోని మొదటి లైనులోని పదాలు అసలు ఇంగ్లీషు పదాలు కావు. ఇవి ఇటాలియన్ మూలంతో ఉన్న పదాలని కొందరి నిర్ణయం. 1525 లో జరిగిన పవియా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి ఈ వాక్యాన్ని రాసాడంట. అతను దాన్ని ఒక నినాదంగా, స్లోగన్‍గా వాడేవాడట. ఓ పాతికేళ్ళ తర్వాత 1559 సంవత్సరంలో స్పానిష్ భాషలో సైంట్ నికొలస్ చర్చిలో ఈ వాక్యం రాయబడింది.

ఆ తర్వాత ఓ నాలుగు వందల సంవత్సరాల తర్వాత 1954 లో జే లివింగ్ స్టన్ అనే అమెరికన్ మ్యుజీషియన్, గేయరచయిత అయిన రే ఇవాన్స్ ఇవే మాటలను స్పెయిన్  భాషీకరణతో అందించారు.

*********

మళ్ళీ హిచ్‍కాక్ చిత్రానికి వస్తే The Man Who Knew Too Much సినిమాలో ఈ పాటను పాడినది కథానాయిక పాత్రధారిణి ఐన డోరిస్ డే. ఆ చిత్రం విడుదల తర్వాత “కే సెరా సెరా” అనగానే ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ డోరిస్ డే నే టక్కున మెదులుతుంది.

*********

కె సెరా సెరా ఇంగ్లీష్ పాట సాహిత్యం

 

‘When I was just a little girl

I asked my mother,

What will I be, will be?

Will I be pretty, will I be rich?

Here’s what she said to me ; 

 

When I was just a little girl.

I asked my mother, what will I be?

Will I be pretty, will I be rich?

Here’s what she said to me:

 

“Que Sera, Sera Whatever will be 

When I was just a little girl

 

I asked my mother,

“What will I be, will be? ;

Will I be pretty? Will I be rich?”

Here’s what she said to me;

“Que sera, sera

– Whatever will be, will be; 

The future’s not ours to see;

 

When I grew up and fell in love ;

I asked my sweetheart,

“What lies ahead?

Will we have rainbows day after day?”; 

Here’s what my sweetheart said ;

Que sera, sera;

Whatever will be, will be

The future’s not ours to see ;

 

Now I have children of my own ;

They ask their mother, “What will I be?” ; 

Will I be handsome? Will I be rich?” ;

I tell them tenderly

Que sera, sera ;  Whatever will be, will be; 

The future’s not ours to see ;

Que sera, sera ; What will be, will be

Que Sera, Sera!

 @@@@@

Your views are valuable to us!