లేత ఆశల కౌగిలి స్థిరంగా మదిలో ముద్రించిన మోము క్రమంగా కాలంలో కరిగిపోదు అపురూపంగా తోచిన స్పర్శ చిరాకుగా ఎన్నడూ మారదు కాలం దేశం అతీతంగా ప్రేమ తన అస్తిత్వాన్ని చాటుతుంది అసహజమైన జీవనం లో సైతం అజరామరంగా…
Author: ఆత్రేయ కొండూరు
కలవని చూపులు
చూపులు కలిసే లోపే తెరలు దిగిపోతాయి.. వంతెనలు కరిగి పోతాయి.. ఊసులు వెనుతిరిగి వస్తాయి.. మరో ప్రయత్నం మరింత బలంగా.. అసంకల్పితంగా.. మొదలవుతుంది.. తీరం చేరే అలల్లా.. ఈ రెప్పల సమరమెప్పటిదాకా ? తలలు తిప్పుకున్న ప్రతిసారీ…
పాఠం
ఒకటే వాన బరువు తగ్గిన ఆకాశం, చినుకుల మధ్యగా ఆటలాడుతూ చిరుగాలి, గుప్పుమంటూ గుంటలు నింపుకున్న నేల, తలదాచుకునే ఆరాటంలో పడుచుదనం పట్టించుకోని పాఠం, పల్లానికి పరుగెట్టి.. చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ.. తాత చేతిపై జ్ఞాపకమవుతూ.. …
మరో ప్రశ్న
తెరలు తెరలుగాఅవే ప్రశ్నలు.. అలలవుతూమనిద్దరి మధ్య నన్ను శోధిస్తానునిన్ను ప్రశ్నిస్తానుతెలుసుకునే లోపేమరోప్రశ్న ..తెలుసనుకున్న దాన్నితిరిగి ప్రశ్నిస్తూ.. వృత్తంలా పరిచి ఉంచినపట్టాల మధ్య, ఇది,ముడులు విప్పుకుంటూ..గుంటలు పూడ్చుకుంటూ..పరుగనిపిస్తుంది ..మనమధ్య దూరమికలేదనిపిస్తుంది. ఈలోపలనీ అస్థిత్వాన్నీ,నా విశ్వాసాన్నిప్రశ్నిస్తూ.. మరో నెర్ర. అతుకుల చక్రం సాగుతుందిమరో అతుకుని…
అయిష్టంగా..
పలచబడ్డ ప్రస్తుతం మీదవయసునూ అలసటనూ అరగదీస్తూబాల్యాన్ని చేరుకున్నాను పరిసరాలను కమ్మిన సొంత ఊరు,చిన్నతనపు కేరింతల మధ్యనెరిసిన రెప్పకట్టలు తెగికళ్ళనుండి పొంగిన పాత కబుర్లుకాలాన్ని కరిగించిగెలిచామంటూ గేలి చేశాయి అయినా.. అయిష్టంగా..గుండెనిండిన తృప్తికడుపు నిండిన జ్ఞాపకంతోవాస్తవంలోకి తిరుగు ప్రయాణం!
మైనపు రెక్కలు
గమ్యం ఎక్కడో శిఖరాలమీదఉద్భవిస్తుంది,పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగాపెదవి విరుస్తూ.. సామూహిక నిస్సహాయతకుసాక్ష్యమన్నట్టువికటాట్టహాసం చేస్తూ.. వాడి ప్రశ్నల వాలుమీదఆత్మావలోకనమే ప్రయాణం.. ఆ నవ్వులు ముల్లుకర్రలుప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ.. ప్రత్యామ్నాయం దొరికేలోపేమైనపు రెక్కలు కరిగిఆత్మ విమర్శై పలుకరిస్తుంది.
తొలి జాము
నిన్న దాచిన రంగుల చిత్రాన్ని రాత్రి మెల్లగా ఆవిష్కరిస్తోంది ** మబ్బుల మగ్గాన్ని దూరాన ..మిణుగురు దండు తరుముతోంది ** పక్షి గుంపులు ఆకాశంలోఅక్షరాభ్యాసం చేసుకుంటున్నాయి ** పొగమంచు తెరలు తీసి ఉదయంచెరువులో రంగు ముఖన్ని చూసుకుంటొంది ** జోడెద్దులు గంటల…
జల్లు
తలపు తడుతూ నేల గంధంతలుపు తీస్తే.. ఆకాశం కప్పుకున్నఅస్థిరమయిన రూపాలుతేలిపోతూ.. కరిగిపోతూ ..అలజడిచేస్తూ..అక్షరాల జల్లు నిలిచే సమయమేది ?పట్టే ఒడుపేది ? పల్లంలో దాగినజ్ఞాపకాల వైపు ఒకటే పరుగు. తడుపుదామనోకలిసి తరిద్దామనో.. గుండె నిండేసరికినిర్మలాకాశంవెచ్చగా మెరిసింది.
మబ్బు
ఎప్పటినుంచో..కాళ్ళు పరిచిన దారికంపలు తప్పుకుంటూపూదోటలనానుకుంటూ.. ఊచలకు ఇవతలనిశ్శబ్దం నింపుకున్నమంచు ప్రమిదల్లోతడి దీపాల ఆరాటంఆ దారి మొదలు కోసం ఈ లోపే మరో అంకం.. పారే నీటి క్రింద గులక రాయిలా..ఆ దారి..అవిచ్ఛిన్నం, నిశ్చలం ఈ మబ్బు విడవాలి
ఈ ఉదయం
బరువుగా బిగిసినతలుపుల వెనక, చీకట్లో..రంగుల ప్రపంచంఓ లోయ సరిహద్దుల్లో అంతమయిందిరెండు సూర్యుళ్ళ ఉదయంతోసగం కాలిన రాత్రిముళ్ళ కంప మీదఅలానే కరిగిపోయింది.చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచిజారిపోతున్న చీకట్లకుతనువు చాలించిన తుంపర్లుతెరలవుతున్నా..చల్లగా వీచిన తెల్ల పదాల తావిపూల తోటలోకి ..దారి చూపింది.