ఫుట్ నోట్స్-1 ఇప్పటికిప్పుడు ఇదే..

1 ఏమీ తెలియకపోవడం గుర్తు పట్టకపోవడం మరచిపోవడమూ –      ఇవి కూడా బాగుంటాయి అప్పుడప్పుడూ.   2 పూల గురించి అంతా తెలుసు అనుకుంటాను వాటి మెత్తని శరీరాన్ని  నిమురుతున్నప్పుడు నా గరుకుతనం గుర్తొస్తుంది.   3 ముళ్ళ ని ఇట్టే…

ఎక్కడికీ వెళ్లలేని రాత్రుల ఏకాంతంలో…

ఎక్కడి నించి మొదలెట్టాలి వజీర్ తో నా ప్రయాణం గురించి? నిజానికి శ్రీశ్రీ మీది కోపంతో మొదలెట్టాలి. కవిత్వ అభిరుచికి సంబంధించినంత వరకూ “ఊరంతా వొక దారి అయితే, ఉలిపికట్టెది ఇంకో దారి” అన్నట్టుగా వుండేవాణ్ణి నేను మొదట్లో! (ఇప్పుడూ అంతేనేమో?) కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాలతో తలమునకలుగా వుండేటప్పుడు, ప్రతి కాలేజీకి వెళ్ళి ఎప్పటికీ రాని విప్లవాల మీద ఉపన్యాసాలు దంచుకుంటూ తిరిగే కాలంలోనే మొదలయింది శ్రీశ్రీ అంటే ఈ కోపం!

పూవు క్షణికమే….పరిమళం సదా!

వంతెనలు చాలా అవసరం. వంతెనల్లేని సమాజాన్ని ఊహించలేం. ఆ గట్టునూ, ఈ గట్టునూ ఏకకాలంలో పలకరించగలిగే ఆత్మీయబంధువది. అంతేనా, గట్టుల్ని చీలుస్తూ పారే నదిని సాదరంగా వెళ్ళనిస్తుంది. కొండకచో దాని ఉద్దృతిని ఆపివుంచి ప్రమాదాల్ని నివారిస్తుంది కూడా. తెలుగు సాహిత్యసీమలో కొన్ని…

సగం కలలోంచి నడిచి వచ్చిన…అజంతా!

“ఓహ్, ఈయన మా బెంజిమన్ మాస్టరులాగా వున్నారే!” – అనుకున్నాను అజంతా గారిని  మొదటి సారి చూసినప్పుడు! చిన్నప్పుడు  చింతకానిలో రోజూ సాయంత్రం మా నాన్నగారితో స్టేషన్ దాకా నడుచుకుంటూ వెళ్ళడం అలవాటు. అక్కడ ఆయన ప్లాట్ ఫారం బెంచీ మీద…

రెండేసి పూలు…

అలా వొక కిటికీ రెక్క ఓరగా తెరిచి వుంచి శబ్దాన్నీ, నిశ్శబ్దాన్నీ విను ఆకాశంలో మేడ కట్టుకున్నా, నువ్వుండేది ఓ మురికి మూల గది అయినా.   ఇవాళో రేపో ఇప్పుడో అప్పుడో అటు వెళ్ళే వొక గాలి తరగని కాసేపు…

విశాఖలో ఆ ఇంకో సముద్రం ఏదీ?!

“అఫ్సర్ గారూ! వచ్చెయ్యండి! శాస్త్రి గారొచ్చారు!” ఇంటర్కమ్ లో పురాణం గారు అనెయ్యడమే ఆలస్యం, నేను ఆఘ మేఘాల మీద మెట్లు దిగి పురాణం గారి ఆఫీస్ లో వాలిపోయాను. అప్పటికే, పురాణం గారు తన టేబులు మీద కాయితాలన్నీ సర్దేసి,…

తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది!

  తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు.  మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు వాక్కులు విన్నప్పుడల్లా , “ఓ ఫైవ్” కోసం మన చుట్టూ…