కవిత్వంలో శైలి

“కలౌ దుష్టజనాకీర్ణే” అని “అజ్ఞాన వ్యాకులే లోకే” అని చాలామంది తిట్టిపోస్తుంటారు. మామూలు ప్రపంచం మాటెట్లున్నా ప్రస్తుతం తెలుగునేల్లో ముఖ్యంగా సాహిత్యసీమలో ఈ తిట్లు అక్షర సత్యాలు. చాలా బ్లాగుల్లో యితరుల రాతల్ని తిట్టిపోసుకొంటూ attacking is the best defense…

కవిత్వంలో కొత్తదనం

  “Everywhere I go I find that a poet has been there before me” -Sigmund Freud   దీన్నే రవి గాంచనిది కవి గాంచు అని అన్నారు మన పూర్వీకులు.  అమెరికన్ కవి ఆడెన్ మరింత విశిదంగా…

సాహిత్యంలో సహృదయత

    ఈశావాస్యోపనిషత్తులో ఆత్మ గురించిన వివరణలో వో చోట “కవి” గురించిన వివరణ వుంది. కవిర్మనీషీ పరిభూ: స్వయంభూ: యాథాతథ్యత: అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య: సమాభ్య: ఆ ఆత్మకవి – సర్వవ్యాపి, క్రాంతదర్శి, ఋషి ఐవుంటాడు. అంతేకాదు అతను విశ్వప్రేమి,…

చెవుల్లేని చోట

నన్నుగాలిపటాన్నిచేసి ఎగరేసిందిసమాజం   నన్నో సముద్రాన్ని చేసి తీరం పక్కనే పెట్టింది సమాజం   చెట్టుకొమ్మలో ఇసుకపర్రలో నా గోల, నాకుమాత్రమే వినబడ్తోందా?   *****

కవిత్వం – విమర్శ

విమర్శల్లో సాత్వికత వుండలని వాదించేవాళ్ళు బహుజనులున్న కాలమిది. దీనికి సంబంధించి నాలుగు మాటలు చెప్పాలనుకొన్నాను. మొదటగా కొంతమంది గొప్పవాళ్ళ అభిప్రాయాల్ని చెప్పుకొస్తా. వాటి ఆధారంగా చర్చించుకొవచ్చు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు వొక వుపన్యాసంలో నాటకం పరిపూర్ణమైన కళ అని చెప్పే సందర్భంలో…

అనువాద వివాదాలు

తెలుగు సాహిత్యం అనువాదంతోనే మొదలైందని యిప్పటికే సవాలక్షమంది సవాలక్షసార్లు చెప్పేవున్నారు. అనువాదంతోబాటు సొంత కవిత్వం గూడా అందులో వుంది కాబట్టే నిలవగలిగాయి. యిక్కడ నాకో సందేహం వొచ్చింది గానీ సమాధానమింకా దొరకలేదు. అనువాదానికి(translation), రూపాంతరానికి(adaptation) గల తేడా యేవిటీ అన్నదే ఆ…

అనల్పార్ధ రచనలు

  ఆకారమేలేని అక్షరాల్ని వాడి సృష్టి అనంతత్వాన్ని పరిమితమైన పదాల్లో ఆవిష్కరింపజేయడం ఒక్క కవిత్వంలోనే సాధ్యం. అందువల్లే అనల్పార్ధ రచనలే జేస్తామని సత్కవులు పూనుకొనేవారు. మనిషి గుండెల్లో గుంభనంగా కాపురముండే అనుభూతుల రహస్యాల్ని ఒక్క కవిత్వమే పరిపూర్ణంగా చిత్రీకరించేది. చిత్రకళలో, శిల్పకళలో,…

కవిత్వం-మూర్త, అమూర్త భావాలు

    ప్రపంచంలోని ముఖ్యమైనవన్నీ మూర్తివంతమైనవి. ఉదాహరణలకు ఆకాశం. సముద్రం, కొండలు, నదులు ఇల్లా. ఇవెంత మూర్తివంతమైనవంటే ఆ పదం వినగానే మనసులో వొక రూపం తడుతుంది. దానికెల్లాంటి వివరణలూ అవసరం లేదు. అల్లానే కవిత్వం కూడ మూర్తిమంతమైందే. ఇందులోని పదాలు,…

అక్కిరాజు ఉమాకాంతం-అభిప్రాయాలు

ముందుమాట: అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు (1889-1942), ఆంధ్రదేశం గన్నటువంటి సునిశిత సాహిత్య విమర్శకుల్లో ఒకరు. అగాధమైన సంస్కృత పాండిత్యం , నిశిత పరిశీలనా శక్తి, ఎదురులేని తర్కం , అన్నింటినీ మించి తెలుగు కవిత్వం పట్ల ఉన్న ప్రేమ అక్కిరాజు ఉమాకాన్తమ్…

కవిత్వం – కొన్ని సంగతులు

  భాషకు అపరిమితమైన శక్తి వుంది. జోకొట్టి, దులపరించి, నిలువు నిలువునా కోసి వెయ్యగల సత్తువ పదాలకుంది. కొత్త ఊహల్ని, లోకాల్ని మంత్రించి తీసుకురాగల మహత్తు అక్షరాలకున్నాయి. ఈ శక్తి, సత్తువ, మహత్తు ఆవిషృతమయ్యేది ఒక్క కవిత్వంలో మాత్రమే. కవిత్వం సూటిగా,…