నదులంటే ఏమిటి?

కేదారనాథ్ లోని విధ్వంసకాండాన్ని పత్రికల్లోనూ, దృశ్యమాధ్యమాల్లోనూ చూసిన తరువాత కరుగని మనసు, మారని మనిషి ఉండబోరని నా నమ్మిక. నిజానికి బదరీనాథ్, కేదారనాథ్‍ల యాత్రలు సులభసాధ్యములు కావు. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, వాటి నుంచి తరచూ రాలి పడే రాళ్ళు, మరోవైపు…

రాలిన పూలను జూచి…

రాలిన పూలను జూచి జాలిని చూపగ జాలకకూలిన మానవుల జూచి చలించగలవే? మరి చలించగలవే? మదిలో సద్ధర్మమ్ముల వదలక సత్కర్మమ్ములసదమల సద్భాషణముల సద్దే లేకున్నఇద్ధరలో నాకము కోరిన – భువిపై శాంతిని లేదన్నసాధ్యమా! సంతతముగ సాధన మరచిన ఓ జీవి? పరహితమన్నది…

విలాసమిదియే!

నిద్రహీన నిశివేళల విరిసే చీకటిక్షుద్ర నిర్దయ శీతగాలి నిట బిగిసెను పిడికిలి కాలమేఘ మహా జాలమును పన్నెను ఆకసంజ్వలంత జీవనమారిపోవుననె మానసం శిశిర ఋతు హత భూరుహమ్ముల భాషలు విసురు గత దిన బాష్ప కణముల ఘోషలు ఫాలతలాన కానుపించని చిత్ర,…

పాట పాతదైతేనేమి?

పాట పాతదైతేనేమి?ఆడే నాగులా మనసూగుతున్నప్పుడు! దూరాన్ని క్షణాల్లో కొలిచికాలాన్ని మైళ్ళలోకి మార్చిరాగాల రంగులరాట్నంపైగిరగిరా తిరుగుతున్నప్పుడు మాటరాని మూగదైనారెక్కలొచ్చిన పిట్ట ఒక్కటిరెక్కలార్చిన చప్పుడటుచుక్కలదాకా ధ్వనించినప్పుడు గాలి తాళానికి తలనువూచేదీపశిఖ తాదాత్మ్యతనుఎత్తిచూపే గోడను చూడుఏదో గుర్తుకు రావడంలేదూ! పాట పాతదైతేనేమి?నీ చెవులకు ఆత్మ ఉన్నప్పుడు!!

జీవవైవిధ్యము (Bio diversity) భారతదేశమునకు కొత్త విషయమా?

సూర్య ఆత్మా జగత స్తస్థుష శ్చ (ఋగ్వేదము) ~~జంగమ వస్తువులకు, స్థావర వస్తువులకు సూర్యుడు అంతర్యామియై ఉన్నాడు~~   సూర్యునికి, ప్రకృతికి, జీవరాశులకు గల సూక్ష్మ సంబంధాన్ని ఇంతకంటే గొప్పగా ఏ శాస్త్రవేత్తా వివరించలేడు. ఇది సత్యము. ఎందుకనగా, సూర్యుని యొక్క…

సంకల్పం

పాఠకులందరికీ అరవై ఐదవ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు సడలనీయదు కడలి, అలల పొంకాన్ని నడినెత్తి సూర్యుడు వడలింపజూసినా అడుగైన కదలదు చూడు, ఆ కొండ పిడుగు బెదిరించినా జడివానకైనా పక్కలో బల్లెమై ‘పాకు’వాడెవడైన మొక్కవోనిస్తామా నిక్కమౌ జాతిని! అరి మర్దన, జనార్దనడు, మురవైరి…

దేవుళ్ళు కార్టూన్లా?

ఇటీవలి కాలములో దేవుళ్ళను కార్టూన్లుగా చిత్రిస్తూ కార్టూను సినిమాలు వస్తున్నాయి. హనుమాన్, గణేశ మొదలైనవి. పిల్లలను ఆకర్షించాలన్న తపనతో విచిత్రములైన అంశాలను చొప్పిస్తూ సాగితాయి ఈ సినిమాలు. అలాగునే పాశ్చాత్య కార్టూను ఫిల్మ్ శైలిని అనుకరిస్తూ మన సంప్రదాయములకు విరుద్ధములైన విన్యాసాలను…

నిన్ను చూసినంతనే

నిన్ను చూసినంతనే శిశిరంలో వసంతంజ్ఞాపకాల గుబురులో ఆకుపచ్చని ప్రశాంతం       ||నిన్ను|| ఆ ఆకసాన తేలు జాబిలికి చాలు ఒక పున్నమినా జాలితనము కోరునే ప్రతిరోజు వెన్నలనిఇది వరమో శాపమో లేక సుమశరుని జాలమో!సిరిమల్లె మురిసి విరిసేటి మధుర కాలమో!        ||నిన్ను|| అలలేని…

నీ చరణముల…

గడ్డిపూవు – 1 నీ పాదముల వ్రాలినా పాపముల జోలిఏనాటికౌను ఖాళీ? ఈ దేహ సీమలోశ్రీ దేవ సన్నధిరాదేలనో స్వామీ! ముందేమిటో ఎరుగసందేహ పాత్రునికిసందేశమందదేమి? ఈ సుఖమె నిత్యమనిలక్ష్యమ్ము మరచేనుశిక్షింపకోయి స్వామి కాంక్షలన్నీ తొలగదీక్షానుబద్ధుడవప్రక్షాళంబదేమి? దిన నాథుడే మునుగతనుప్రాయమే తరుగవినిపించు మృత్యుఘంట…

అన్నము – మరిన్ని విశేషములు

అన్నము – భారతీయ సనాతన దృక్పథము పై వచ్చిన ప్రతిస్పందనలు చూచి, ఎస్వీకే20012 అను పాఠకుడు అన్నము అనగా బియ్యముతో వండిన పదార్థమని పొరబాటుపడినట్టే ఇతరులకు, జిజ్ఞాసువులకు  ఆ వ్యాసములో వదిలివేసిన వివరములను చెప్పడముద్వారా ఉపయుక్తముగా ఉంటుందన్న ఉద్దేశ్యముతో ఈ వ్యాసమును…