సాయం నీడలు…

మొన్నటి వాన సాయంకాలపుఇంద్రధనస్సు నింగిలోకి ఇంకిపోయింది..రంగుల్ని మాత్రం చుట్టూరా పరిచేసి! అనుభవాల అల్మరాఅప్రయత్నంగా తెరుచుకున్నప్పుడల్లాఎండిన మొగలిరేకులుగరుకుగా తగుల్తూనే గుబాళిస్తాయి.. కాలం క్రమబద్దంగా ఎండగట్టిన గుండె పగుళ్ళ మీద ఉన్నట్టుండోఆత్మీయపు వేసవివానఆసాంతం  కురిసి పోతుంది.. ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరం..గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే…

అదే వాన…

జోరుగా మొదలైన వానఆగకుండా.. నిలకడగా పడుతూనే ఉంది..మన పరిచయంలానే! రోడ్డు చివరి ఒంటరి పాకలోతగిలీ తగలకుండా… హడావిడి పడుతున్న చీకటిలోనింపాదిగా తడుస్తున్న కొండని చూస్తూ.. ఒకరికొకరమని తెలుస్తున్న తొలినాళ్ళవి.. ఉరుము ఉలికిపాటుకితగులుతున్న భుజంసంకోచపు సరిహద్దునిచెరిపి వేస్తుంటే.. అవసరమైన సందేశమేదో అందినట్టుగాలితెర దీపం…

ఒట్టేసి చెప్పవా!

నువ్వు ముందా? రాత్రి ముందా?సాయంసంధ్యతో నా రహస్య పందెం…ఫలితం ముందే తెలిసినట్టుమరపునపడ్డ పాట ఒకటి తోడు కూర్చుంది! ఆకాశదీపాలన్నీ వెలిగాకనీ ఆనవాలేదోతలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది.. కళ్ళూ కళ్ళూ కలవగానేసిద్ధంగా ఉన్న సగం నవ్వుపెదవులపైకి జారుతుంది…అలసట జతగా తెచ్చుకున్న అసహనంమాటల్ని ముక్కలు చేసి…