తపస్సు

ఎప్పటికో గానీకవిత్వంచేపలా చిక్కుతుంది.ఈలోగా వలలోఊపిరాడక నేను. **   ** చేప దొరకనిఎన్నోసార్లుఒంటికాలుపై తపస్సు చేస్తూ,కొంగలాఇప్పుడూ నేనే.

కాకి దాహం

అనగనగా ఓ ఆంధ్రా కాకి. దానికి దాహం వేసింది. నీళ్ళకోసం తెలంగాణా, కోస్తా, రాయలసీమ జిల్లాలన్నీ వెతగ్గా, వెతగ్గా చివరకు మహారాష్ట్ర  సరిహద్దుల్లో ఒక కుండ కనిపించింది. కానీ, అందులో నీళ్ళు కాకికి అందనంత అడుగున వున్నాయి. ఆలోచించగా ఆలోచించగా కాకికి…

ద్విముఖం

కప్ప ఓ పెద్ద గెంతు గెంతి,ఆకాశాన్నంటుకుందిచెరువునీట్లో. * * * అసలే ఆలోచన్లుచేపల్లా చికాకు పెడ్తుంటే,లోనికి దూకిన కప్పచెరువు ధ్యానాన్నిచెడగొట్టింది.

రైన్ రైన్ గో అవే

ఎప్పట్లాగే,  అటక మీద వున్న విత్తనాల మూటను వీపుమీదకు దించుకుని, పొలంవైపుకు మౌనంగా మోసుకుపోతున్నాడు ఓ వెర్రి రైతు.   “పట్టెడన్నం కోసం, పట్టుదలగా ప్రయత్నిస్తూ, ప్రతిసారి నువ్వు పడే కష్టాలు చూస్తుంటే, తెగ జాలి  పుడుతొంది తమ్ముడూ!”  అంటూ మూటలోనుంచి…

ధన ‘యోగ’మ్

జోక్ పాల్ బిల్లు కోసం, చిన్నాహజారే చేపట్టిన నిరాహార దీక్ష, మూడోరొజుకల్లా మూణ్ణాల ముచ్చటగా ముగిసిపోవడంతో, ప్రభుత్వం వూపిరి పీల్చుకుంది., ఐతే, మళ్ళీ వూపిరి వదిలే సమయంకూడా ఇవ్వకుండా,  ప్రముఖ యోగా గురువు ఢాందేవ్ బాబా ‘నల్లధనం దీక్ష’ రాంలీలామైదానం లో…

రెండో కృష్ణుడు

మార్నింగ్ మార్నింగ్ జయమ్మ నిద్ర లేచేసరికి, వూరు వూరంతా ఇంటిగుమ్మం ముందు గుమికూడి వున్నారు.   “విన్నావా జయమ్మా..? నీ అల్లరి కుట్టి మా ఇటుకల బట్టిలోని మట్టి మొత్తం కాజేసాడు.!” “నీ గారాల పట్టి, మా కంట్లో దుమ్ముకొట్టి, ఎకరాలకు…

రాజుగారి క్రీడాభిరామం

ఎట్టకేళకి  ‘మీ గ్యాస్ మీకే’ పథకాన్ని చేజిక్కించుకుని, స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి గారి ముఖం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లా వెలిగిపోతోంది. కానీ.. ఈ సందర్భాన్ని సంబరంగా చేసుకునేందుకు సహచరులెవరూ సుముఖంగా లేకపోవడంతో, సి.యం. గారు చిర్రెత్తిపోయారు. ఇంతకీ అంతిమ లబ్దిదారుడెవరో…

ఎదురింటి బాల్కెని

ఎప్పుడైనా ఓసారిఆ గోడల మీదకాకులొచ్చి వాలేవి. ఆవిడొచ్చిరంగురంగు పావురాళ్ళనుమొక్కలకు పూయించింది. చిట్టి చేతుల్తో తీగ పాదుల్నితట్టి లేపింది. అంతా గుప్పెడు మట్టే. పువ్వుగా ఎదిగేవిత్తనాన్నిసుతిమెత్తగాతడిమి చూసింది. అభిమానం ఎరువుగాచల్లుకుంటూవెళ్ళేదా..? తిరిగొచ్చేసరికి,తీగెలు పరిమళాణ్ణిప్రతిధ్వనించేవి. ఎండిన ఆకు,ఆమె కంట్లోనీటి చుక్కాఒకేసారి రాలి పడేవి. ఆ…

రూట్స్

ఓ అపార్ట్ మెంట్ వెనుకసూర్యుడు దాక్కున్నాడు.మరో అపార్ట్ మెంట్ వెనుక చంద్రుడు! ఇకనాకోసం మిత్రులంతా-చరిత్ర పుఠల్లోవెతుక్కుంటున్నారు!!

గ్రీన్ హంట్

కరువుతో కాల్చడానికేవేసవి రెక్కింగ్. గొంతులోని విషాన్నికక్కలేక, మింగలేక, పొలం దున్నుతూపరమశివుడు. కడుపునిండా గడ్డితిన్నప్పటి-పాత జ్ఞాపకాల్ని ‘నెమరేస్తూ’ఓ ఆవు. నీళ్ళులేని ఏట్లోముఖం వెతుక్కుంటూపున్నమి చంద్రుడు. ముస్తాబైన మేఘాన్ని చూసి,సిగ్గు మొగ్గైనపైరు పెళ్ళికూతురు. తడిస్తే జలుబొస్తుందనిమొక్క మీద గొడుగులాతెల్లటి మబ్బు. ఒక్క గింజనూ కనలేకగొడ్రాలైందివరిచేను.…