ఆమె – నేను

కట్టుకున్న బట్టల్నిఒక్కోటీ విప్పేస్తూనగ్నంగా నిలబడిందితను. నిజాన్నిఅంత నిర్భయంగా చూడలేక,కళ్ళు మూసుకున్నానేను. 

ఆ రాత్రి

దేహచ్చాయల మీద ఆరేసుకున్న వెన్నెల క్రీనీడలు. నఖక్షతాల్తో చంద్రుడు,నక్షత్రాలు. విస్తరించిన నిమిషానందపు బోన్సాయ్ వృక్ష సమూహం. పరిమళ నిశ్వాసం పరుచుకున్న పట్టెమంచం. మేని సానువుల్లో అధరాలు తచ్చాడిన తడి జ్ఞాపకాలు. ఎనిమిది కాళ్ళతో చలించిన అక్టోపసి. సుషుప్తి గవాక్షాల్లో రెక్కలిప్పుకుని, సుదూరమైన…

మరణ వాంజ్మూలం

లెప్ట్ రైట్, లెప్ట్ రైట్ఎవరి దారి వారిదే.ఐతే ఒరే-నాలుగు భుజాలా మోస్తున్న పాడెనునడివీధిలో వదిలెయ్యకండి. ఎవరి పూజలు వారివేఎవరి పూలూ వారివేఐనా సరేఒంటరిదైన తోట కోసంకాసేపు ప్రార్ధించండి. ఎదిగొచ్చిన ప్రతి గింజ మీదామీ మీ పేర్లు రాసుకోండికానీపొలాల మధ్యఇనుప కంచెల్ని పెరగనీకండి.…

భారతీయం

ఓసారి దేవతలంతా అనుకున్నారు మనుషులుగా పుట్టాలని.! మరి రాక్షసులు ఊరుకుంటారా? వెంటనే పుట్టేశారు రాజకీయ నాయకులుగా..!!

కుటీరం

తూర్పు,పడమర గోడలకు-రెండు కిటికీలతో,మాకొకపన్నెండడుగుల గది మాత్రమే వుంది.ఐతే ఏం?ఆ కిటికీ దాటి,ఈ కిటికీలో కనిపించడానికి,సూర్యుడికి-పన్నెండు గంటలు పడ్తుంది.

‘హైడ్ అండ్ సీక్’

నలుగురమూ ఒక్కో చోటు వెతుక్కుని, రహస్యంగా దాక్కున్నాం. మిగిలిన ఒక్కడూ- ఎక్కడున్నామో మమ్మల్ని కనిపెట్టాలి. ** ** ** ** నలుగురమూ ఆ ఒక్కడ్నీ మోసుకెళ్ళి, ఓ చోట దాచి పెట్టేసాం. ఎక్కడున్నా, ఇక ఎప్పటికీ వాడు కనిపించడు.