దద్దమ్మదినోత్సవం

పంద్రాగస్టంటే సాలు మా పోరగాళ్ళకి యాడలేని ఇది. కుడిసేత్తో ఎడంసేత్తో వో తెగ తిరంగాల్ని వూపేస్కొంటా తిరిగేస్తరు. ఉత్తినే తిరగ్తారా అంటే..ఉ ఊ…”Wish you happy Independence day” అన్న అరుపొకటి. అంగ్రేజోణ్ణి తరిమేసినామని అంగ్రేజు బాసలో సెప్పుకోడం మన దేసబక్తి.…

వెలుతురు

మళ్ళీనేను మొలుచుకొస్తానునా చావులోనుంచే… వొంటి గుడిసెలో దీపం పెడతానుపారిపోయిన పిట్టల్ని పట్టుకొచ్చిగింజల్ని విసుర్తా రెక్కలు మొలుచుకొచ్చిన వెలుగునిచుక్కల చిక్కుల్లోంచి తప్పిస్తా వక నల్లమల కొండపైచీకటి గోడ్డళ్ళు వేటు వేస్తేవెలుతురును విరజిమ్మేసి పోతా..మీరు మళ్ళీ నన్ను తవ్వి పాతరేసేలోగా

నింగిమేడలు

వాన నీళ్ళని తాగిగుటకేస్తోన్న ఇటకరాళ్ళ గుట్ట యిసక గుట్టతోగుసగుసలాడ్తోంది గెంతుతోన్న కప్పకెందుకో ఆయాసంగుండె దాని గొంతులో కొట్టుకొంటోంది గుడ్డివెలుగులోవన్నం తింటోన్న కూలీ కుటుంబంవాళ్ళని చూస్తోకునకడానికి సిద్ధమౌతోన్న కుంపటి కార్పొరేట్ కుళ్ళు చేరేందుకుఇంకా టైముంది…

పగలు రైతు

పగలు రైతుకిరణాల్ని నాటుతూ వెళతాడా!కోట్ల కళ్ళు విచ్చుకొంటాయి మాయదారి రాత్రి రౌతుగుర్రపు డెక్కలు విదిల్చిన మంచుపగలు రైతు పాదాల కింద అణిగిపోతుంది రహస్యాల్ని దాచుకోలేనినిష్టుర నగ్నత్వంను లోకం కప్పుకొంటుంది చెమట ఘాటులోకిరణాల్ని నాటుతూపగలు రైతు.

నాలోపటి సూరీడు

విసిరికొట్టిన మెతుకల్లేఆకాసంలో అంటుకొన్నాడు చందమామఆకలేసిన బిచ్చగాడికి ఇంతకంటే కవిత్వం రాదు గ్లాసంచున దుమకబోతున్నఐసు చుక్కలా చందమామనషా కాషాయ తాషామర్ఫాలోజోగుతోన్న జోగి, జోగినీమణికిఅంతకంటే పైత్యమెక్కవే! చీదగా మిగిలిపోయినచీమిడి చుక్కలా చందమామమొగుడు చాటు పెళ్ళాంకుఅప్పుడు, ఇప్పుడూ వొకే చంద్రడు చిట్లిపోయిన చుక్కల్ని చూసిచంద్రుడు బావురుమంటుంటేమంటల…

చెప్పలేను

ఒక్కోసారి అలా ఐపోతూ వుంటుంది రెప్పకు రెప్పకు మధ్యన ఉప్పునీళ్ళ జీవితంఇరుకుగా, కరకుగా కదులుతూ వుంటుంది ఏవో నీతులు, జాతులు, గోతులుపావురాయి కాలికి కట్టిన దారంలాపక్కలో బల్లెంలాబక్కటెముకల్లో గుచ్చుకుంటుంటాయి చిత్తుకాగితంలాంటి ప్రపంచాన్నిఉండ చుట్టేసాను కానీచెత్తబుట్టే కనబడ్డంలేదు ఎందుకో ఒక్కోసారి అలా ఐపోతూ…

ఎండుటాకులు

చావుకు ఆడా మగా తేడాలేనట్లేద్వేషానికీ లేదన్న నిజం తెల్సాకఆశ్చర్యంలోకానికేమీ కాలేదుసిగ్గులేనితనంతో వెల్లకిల్లా పడుకోని పుల్లద్రాక్షల్ని కలవరిస్తాందినాకేమో వొంటి మీని బట్టల్నెవరో వూడబెరికినట్ట్లైతాంది! —- లింగసౌఖ్యానికి లొంగిపోయిన అమ్మాయొకతెవిసిరికొట్టిన పసిబిడ్డ చుట్టూతా ద్వేషవలయంలా యీగలు!మురిక్కాల్వ వుయ్యాల్లో మోసగీతానికి జోలపోతూ ఆ బిడ్డ! —–…

మతిమరుపు

డబ్బుకు జ్ఞాపకశక్తి ఉండదుఉంటే, గింటే వాడు నీ ఉపకారాన్ని మర్చిపోతాడా?అప్పట్లో, అప్పటప్పట్లోనీ జబ్బల్లో డబ్బు నిబ్బరంగా దర్పాన్ని పొదిగినప్పుడువాడో పిల్లకాకినీ చూపుడువేలు ఉండేలు దెబ్బకిఎగిరిపోయి, “కా” మనేవాడుమరుక్షణంలో మళ్ళీ వాలేవాడునువ్వో – లాలనగా నీ డబ్బు దర్పపు జబ్బల్లోకిఇరికించుకొని ముద్దల్ని తురికేవాడివి…………

వొద్దులే

కంట్లో నీళ్ళ చుక్కల్తో నిన్ను చూస్తేపగిలిపోయిన ఆకాసం నుండిజాబిల్లి రాలిపడినట్టనిపిస్తాది బతుకు అపస్వరం పలికినాకఅవసరం యెవరిదైతేనేంలే! యెవడో వాడుమొగవాడంతేనువ్వో జూకామల్లెవి అంతా ముగిసినాకవాడు..ఎవడైతేనేంలేఊళ్ళో మరో గదిలో మరో జూకామల్లెకోసం పోతాడునువ్వు మాత్రంఅదే గదిలో మరోసారివికసించడానికి పనికిమాలిన ప్రయత్నం చేస్తాంటావు నీ కంట్లో…

పిచ్చిలో….

నేనో పిచ్చిమొక్కనిరోడ్డు పక్కో, సగం కూలిన గోడ సందులోనో పుట్టుకొస్తా నాలాంటిదే పిచ్చిగాలికొంచెం జోరుగా, కొంచెం తూలినట్లుగా వీస్తాదినేనూ ఊగుతా నా ఒంటరితనం మాయమైపోవడం ఇష్టంలేనిచెయ్యొక్కటి నా గొంతును నులుముతుంది గాలి పిచ్చితోటి నా తలఆ చేతిలో ఊగుతానే ఉంటది