రోడ్డుపై తన క్రీనీడ చూసుకొని ఉలిక్కిపడింది వీధి దీపం వేదాంతం పట్టని పట్టణం చీకటిని ఆబగా కావలించుకొంటోంది పుట్టగొడుగు మేడల్లోంచి రాలిపడే మెతుకుల్ని చూసి చచ్చిన బొద్దింక నాలుక చప్పరించింది టీవీలో “అభిరుచి”, పొట్టనిండినోడి “అజీర్తి” అదేపనిగా రమిస్తున్నాయి …
Author: Sagatu Telugu Jeevi
బావిలోని కప్ప వొంటరిది కాదు!
కొండలకు కళ్ళుంటాయ్ గుండె లోయల్లోకి జారిపోయిన వాటిల్నేవో పగలు రాత్రీ వెతుక్కుంటుంటాయ్ నోరున్న మేఘాలు భోరుమంటూంటాయ్ మాటల్ని కురిపిస్తుంటాయ్ మేఘం మాట నేల మీద చిట్లినప్పుడు బద్దలైన రహస్యమొకటి అనామకంగా అడుగులోకి మడుగైపోతుంది మనసు పోగొట్టుకొన్న నేను గతం…
విలువ లేనితనం!
నువ్వున్నన్నాళ్ళూ పక్కవాళ్ళకు పొద్దుగడిచేది వొళ్ళు, కళ్ళు, చెవులు – నీవెట్లా తిప్పితే పక్కోళ్ళవీ తిరిగేవి నీ గుండెలోతుల్లోకి నువ్వు జారుకున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నీలిచిత్రాల్ని గీసుకొనేటోళ్ళు ఇప్పుడెవ్వరికీ పొద్దు గడవడంలేదు చావులోయలోకి రాలిపోయిన ఆకువైనావుగదా! సమాజం తోసిందా? నువ్వే తోసుకొన్నావా? ఎవడిక్కావాలీ…
కూలనీ!
యింత ఖుషీ యెప్పుడూ దొర్కలా! యిరగ్గొట్టి, మంటెట్టిం తర్వాత యియ్యాలే తెలిసొచ్చెనా? నొప్పిలో సుఖముంటదిలేబ్బా! కాంక్రీటు మొండాల్తో యింగా యెన్నాళ్ళు నిలబడ్తార్లే యీ గుండె చాల్దా యేం? కయిత్వమైనా, కాంక్రీటైనా అరాచకత్వంలోనే వికసిస్తాయి
మూతబడ్డ జీవితాలు
చచ్చినోళ్ళు ఫ్రేముల్లో బతికినట్లు నేను ఈ గోడల మధ్యన అతుక్కునుంటా బేల పెళ్ళాం చెంపల మీద బేవార్సు మొగుడి దెబ్బలా కడుపు మీద ఆకలి మడతలు పచ్చని చెట్ల మధ్యన ఇనుపస్థంబంలా వెర్రిగా రోడ్డులో దిగబడిపోతాను లైటు హౌసు దీపంలా ఉండాల్సిన…