‘చేతి’లో… చీపురేసి చెప్పు ఆ.ఆ.పా!

  చేతిలో… చీపురేసి చెప్పు ఆ.ఆ.పాచేసినన్ని బాసలు చెరిగిపోవనీ, మరచిపోననీ…   కాపురం చేసే కళ కాలు పెట్టిన రోజే తెలుస్తుందని… ‘చేతికి’ చీపురిచ్చిన ఆమ్ఆద్మీ ఢిల్లీని ఏదో ఉద్ధరిస్తుందనుకోవటం భ్రమల్లో బతకటమే! కాంగ్రెస్ ఊదే గాలితో ఆమ్ఆద్మీ బూర ఎన్నాళ్ళుంటుందో…

అనుకూల పవనాలా, వ్యతిరేక పవనాలా?

భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో పదవీ వియోగం కలిగి పదేళ్ళయ్యింది. మొత్తానికి, నక్కతోక తొక్కినట్లు నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా రంగంలోకి దించిన తర్వాత ఆ పార్టీకి బానే కలిసివస్తున్నట్లు కనిపిస్తున్నది. 2002 నాటి గుజరాత్ మతఘర్షణల కళ్ళజోడు తగిలించుకునే చూస్తున్న చాలామందికి…

ఆమ్ఆద్మీనా, అంతా హవాయేనా?

2000-2001లో శంకర్ దర్శకత్వంలో అనీల్‌కపూర్‌తో నాయక్ అనే సినిమా వచ్చింది (తెలుగులో అర్జున్‌తో ఒకేఒక్కడు). ఆ కథలో ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి, ఆ ఒక్కరోజులోనే ప్రజలకు మేలు కలిగించే పనులెన్నో చేసి, ఆ…

ఇపుడేది కర్తవ్యం… మనుటయా, మరణించుటయా?

కొన్ని నెలలలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనలుగా భావించబడ్డ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, ఢిల్లీ ప్రజలు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టే! పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా, కిందపడ్డా మీసాలకు దుమ్ము అంటలేదనే కాంగ్రెస్…

My Father

  మన తెలుగు సినిమాలలో ఈమధ్య తెలుగుదనం బొత్తిగా కనిపించటంలేదు. హీరోయిన్ పాత్రలతో మొదలైన పరభాషానటుల దిగుమతి సంస్కృతి, ఈనాటికి తల్లి పాత్రలకు, తండ్రిపాత్రలకు, విలన్, కామెడీ పాత్రలకు కూడా పరభాషా నటులను దిగుమతి చేసుకోవటం దాకా వచ్చింది. కాబట్టే, మన…

అలుగుటయే ఎరింగిన….

అద్వానీ గారు మరోసారి అలిగేసారు! మొన్నటికి మొన్న 2014 ఎన్నికల ప్రచార బాధ్యత మోడికి అప్పగించిన తర్వాత అలిగారు. నిన్నటికి నిన్న, మోడీని 2014 ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినందుకూ అలిగారు. ఈ అలుగుటకు కారణాలు; మోడీకి బాధ్యతలు ఇస్తున్నందుకా, తనకు…

ఇద్దరు బిడ్డల తెలుగుతల్లి 2

మొన్నటిదాకా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందనుకుంటే, ఇప్పుడు సమైక్యాంధ్ర పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. అక్కడా విగ్రహాలు పగలగొట్టారు, ఇక్కడా అదే తీరు. ఉద్యమకాలంలో అక్కడ మరణించిన ప్రతిఒక్కరినీ తెలంగాణా కోసం లెక్క కడితే, ఇప్పుడు ఇక్కడా…

ఇద్దరు బిడ్డల తెలుగుతల్లి

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు దోశె వేసినంత సులభం కాదు. అన్ని పక్షాలతో చర్చించాలి. ఏకాభిప్రాయం సాధించాలి. ఆ పిమ్మటే, తెలంగాణా గురించి ఆలోచించగలం. 2009 డిసెంబరు ప్రకటన దరిమిలా కాంగ్రెస్ రాష్ట్ర, దేశ రాజకీయ పార్టీలను అనేక విధాలుగా ఇరుకున పెట్టి,…

దాగుడుమూతలు

ఎప్పుడో మొదలైన ఆట ఇదిఇప్పటికీ మారలేదు. దాటిన గోడలుదాగిన నీడలుఅన్వేషణలో ఇవి మామూలే వైఫల్యం, వైరాగ్యం మధ్యగెలుపు అనుమానాస్పదమైతేఆ పక్కనే మరో ఆశ అలజడే అదృశ్యమైతేకనుచూపు మేరాకాంతిపుంజాలే

విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి

పార్లమెంటు ప్రాంగణంలో ఎన్.టి.ఆర్. విగ్రహం ఏర్పాటు విషయంపై పెద్ద దుమారమే రేగుతున్నది. అటు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ. ఇవ్వటం ఒక విశేషమైతే, ఇటు విగ్రహం ఏర్పాటుపై ఎన్.టి.ఆర్. కుటుంబసభ్యులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవటం మరో విచిత్రం!  తెలుగు…