గ్రూప్‌ ఫోటో ముంగిట్లో . . .

అప్పుడప్పుడూ గ్రూప్‌ ఫోటో ముందు నిల్చున్నపుడు  కాలేజిదినాలొచ్చి చూపుల్తో కరచాలనం చేస్తాయి.  స్మృతుల బంధువులు వేలాడే మెదడు కొమ్మనై  స్నేహకెరటాల్ని మోసే నేత్ర సాగరాన్నై  మధుర ప్రకంపనల్ని వెలార్చే హృదయవీణా తంత్రినై  శబ్దాలతో కట్టిన నిశ్శబ్ద శిఖరాన్నై  గ్రూప్‌ ఫోటో ముందు…

చదువంటే!

రెమ్మలకి టాటా చెప్పి మెల్లిగా కొమ్మల్ని విడిచి  దారెంట – నడిచే సరిగమలై, మెరిసే కిరణాలై బడిముంగిట గీతమై అల్లుకొనే ఒకే చెట్టు పూవుల్లాంటి బడిపిల్లల్ని చూసి ఆ పిల్ల కళ్లు – చిన్ని చిన్ని మడుగులవుతాయి. ఆమెక్కూడా – తనో పూవయి ఆ వరసల్లో అమరాలని వుంది. బడి…

ఆమెలో నేను

ఆమె పసిచెవి కొస రింగునైభుజాల మీద ఎగురుతూబాల్య వాసనల దుమ్మునిఒళ్లంతా పూసుకొంటాను.ఆమె యువహృదిపయి తాళినైగాఢంగా హత్తుతూసుఖ దుఃఖాల లేపనాన్నిగుండెల్లో రుద్దుకొంటాను.ఆమె పృధు గళమున నగనైగాంభీర్యానిస్తూజీవన భారపు రుచుల్నినుదుటిపై రాచుకొంటాను.ఆమె ముదికరమున కర్రనైపిడికిట్లో నడుస్తూగతవాసనల కమ్మదనాన్నిమధురంగా పాడతాను

కాస్త చోటివ్వండి

బస్సులో సీటు దొరకని యీ నాలుగ్గంటల సాయంత్రం నిద్ర కళ్లతో తూగుతూనిల్చోలేక అవస్థపడే ఆ పిల్లాణ్ణి కాస్త దగ్గరదీయండి.గొంగళి పురుగును మోస్తోన్న చివురుటాకులామూపున పుస్తకాల బస్తాతో చెమటలుకక్కే ఆ పసివాడికిమీ మధ్య కొంత చోటివ్వండి.పల్లెల్ని సుడిగాలిలా క్రమ్మినకాన్వెంటు చదువుల వ్యామోహంఫ్రీపాస్‌ ప్రయాణమై…

కళ్ళం

ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు జీవితాన్ని పంటకళ్ళం చేసేంత ఓపిక ఎవరికుందని?తొలికోడి కూతకీ ఎద్దుల గాడికీ మధ్య మనిషి వాసన లేదు_ట్రాక్టెర్ కమురు కంపు తప్ప పేడతో అలికిన కళ్ళానికీ పంట కంకులకూ మధ్య నూర్పిళ్ళపొలికేకల్లేవు _మిషన్ దబాయింపులు తప్ప…