అరవై ఏళ్ళ పండగ బ్రహ్మాండమైన తంతుగా ముగించేసారు పార్లమెంటులో మన ప్రజాప్రతినిధులు. పాత నేతల ఆదర్శాలపై ప్రసంగాలు దంచేసారు. మిగిలిన ఇద్దరు ముగ్గురు పాత తరం పార్లమెంటేరియన్లని సత్కరించేసారు. పార్లమెంటు ప్రతిష్టను పూవుల్లో పెట్టి మరి చూసుకుంటామని సురేష్ కల్మాడి, లాలు…
Author: Savyasachi K
చిటపటలు-22 “దగ్గులు తుమ్ములు” (The Cough & Sneezes of Indian Politicians)
ముఖ్యమంత్రి అవుదామనే దురాశతో ఉప ఎన్నికలకు జగన్ కారణమయ్యాడట! ఈ విమర్శలేవో నల్లారి వారో, నారా వారో చేస్తే సరిపుచ్చుకోవచ్చు. ఆఘమేఘాల మీద సి.ఎం. అయిపోదామని పార్టీ పెట్టి, గిరాకీ లేక ఆ పార్టీనే అమ్ముకొని, రాజ్యసభ సీటు కొనుక్కున్న కొణిదెల…
చిటపటలు-21 “చెవిలో పూలు”
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మన గవర్నర్ గారు లాంఛనంగా తన ప్రసంగంతో ప్రారంభించేసారట. ఆయన ప్రసంగంపై రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. కమ్యూనిస్టులు : ప్రజలపై పన్నులు మోపి ఆదాయం పెరిగిందని చెప్పుకోవటం, అవినీతిలో మునిగిన ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేయటం,…
చిటపటలు-20 “దున్నపోతులు – వడగళ్ళ వానలు”
ఈమధ్య రాష్ట్రంలో మద్యం సిండికేట్ల మీద ఎ.సి.బి. దాడులు చేస్తున్నది. అందులో భాగంగా అరెస్టైన ఓ మద్యం వ్యాపారి రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి మోపిదేవి రమణతోపాటుగా తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐ., సి.పి.ఐ (న్యూ డెమొక్రసి), భా.జ.పా. నేతలకు కూడా లక్షల్లో…
చిటపటలు-19 “చంటబ్బాయిలు – చంద్రబాబు”
పాపం చంటబ్బాయ్. తెలుగు సినిమాలలో ఎన్నెన్నో “పాత్రలు” అవలీలగా పోషించేసాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనో “పాత్ర” ధరిద్దామనుకుంటే, ప్రజలు వేరే “పాత్ర” ఇచ్చేసారు. ప్రజలిచ్చిన “పాత్ర” ఈ జగదేకవీరుడికి నచ్చలేదు. ఈ “పాత్ర” మారాలంటే మరో అయిదేళ్ళు పట్టేస్తుంది. త్రినేత్రుడి…
చిటపటలు-18 “తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ ల వలన…”
ఏకు మేకవ్వటం మనకు తెల్సిందే. కొన్ని నెలల క్రితం కొన్ని వందలమందితో జంతర్ మంతర్ దగ్గర అన్నా నిరాహార దీక్ష చేసారు అవినీతికి వ్యతిరేకంగా. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆయనకు బాసటగా నిల్చారు. ప్రభుత్వం దిగొచ్చింది. లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీలో…
చిటపటలు-17 “కాంగ్రెస్ లో యువరక్తం”
రాష్ట్ర కాంగ్రెస్ ను యువరక్తంతో నింపే దిశగా రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. యువరాజును మోయటానికైనా, యువనేతను తోయటానికైనా ఇప్పుడున్న నేతల్లో చేవ చచ్చిందని, అందుకే వారి వారసులకు వల వేస్తున్నాడని గిట్టనోళ్ళు కోళ్ళలా కూస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో…
చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు”
ఈమధ్య డిగ్గీరాజా వారి “దండోపాఖ్యానం” వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి “దండబోధ”లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి. * * * 2007 లో ఏదో దద్దమ్మల సామాజిక…
చిటపటలు-15 “చితకబాదుడు రాజకీయాలు”
ఈమధ్య (21 జులై 2011)టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ గారు ఆంధ్రా భవన్ లో ఓ అధికారిని (కె. చంద్ర రావు) చితకబాదారట! కారణం ఈయన చెప్పిన మాట ఆ అధికారి వినలేదట. మొన్నెప్పుడో (8 ఏప్రిల్…
చిటపటలు-14 “మేధావులు, కొశ్శినీలు”
రాష్ట్ర కాంగ్రెస్ లో మేధోమధనం జరగాలని వి.హెచ్. ముఖ్యమంత్రికి, పి.సి.సి. అధ్యక్షుడికి లేఖలు వ్రాసారుట! కాంగ్రెస్ లో మేధావులంటే చేతికి మంత్రదండమైనా ఇస్తారు లేదంటే, కాళ్ళు చేతులు కట్టి కుర్చీలో కూర్చోబెడతారుగానీ వాళ్ళతో మేధోమధనం ఎక్కడైనా చేస్తారా? కాంగ్రెస్ లో, అందునా…