మినీ కవితలు

జార్చిన హృదయమెంతగా బాధ పడుతుందోనని  అందరికన్నా ముందుగా ఆ హృదయాన్ని ఓదార్చవూ ఆ జారే కన్నీళ్ళు   *************   నీడలు, నేలతో చెప్పే ఊసులనే కదూ! పదాలుగా అల్లి పాడుకుంటూ పోయేవా సెలయేళ్ళు   *************   దొరలనుండి విముక్తి…

మినీ కవితలు

   వెన్నెల్లో, సాలెగూటి వల వేసి అందిన కాడికి ఆ నక్షత్రాలను పట్టేశానోయ్! తక్కువైపోయాయంటే ఎట్టామరి? ************* తన వైపుకు నా అడుగులు పడుతున్నాయన్న ధీమాతో తను ఎదగడం మొదలు బెట్టిందా కొండ! *************** నావికుణ్ణి వెతుక్కుంటూ వచ్చే తీరం కదటోయ్ వసంతం…

కొన్ని హైకూలు

తలకట్టు, దీర్ఘమైతే  పోయిన ప్రాణం  తిరిగిరాదా? ఆ పూలజడలకి  ************** ముందుకెళ్తూ  వెనుకకు చేర్చేది ఫ్యాషన్  వెనుకబడుతూ  ముందుకు నడిపేది కల్చర్  **************** మనసు చేసే  మౌనపు సేద్యాన  కలుపు తప్పదోయి ఊహలుగా   ************** ప్రకృతి అందాల వెనుక  పరుగులెత్తే మనసులకి …

అగాధం

అగాధం   అనుభూతికి హృదయానికి నడుమ  మనిషికి మనిషికి ఏర్పడినంత  అగాధమేర్పడిన్దిప్పుడు  ************* హైవే    రాలిన ఆకులే వాహనాలుగా  హైవేను తలపిస్తుందా  కోనలోని సెలయేరు  ************* చక్రాలు    యుగం మారి  ధర్మానికి విరిగిన ఒక్కో కాలు  చక్రాలై అమరాయా…

తెర

నేటి బాలల కోసం నువ్వు లేవనుకున్నాను గాని  బడి గోడలూ, దాటేశావని తెలుసుకోలేక పోయాను.  సమ్మోహనాస్త్రాలు మెండుగా ఉన్న  ఉద్వేగోన్మాదివి నువ్వు.  ప్రేమలను విరబూయిస్తావు, పగలే పరమార్ధమంటావు,  రాని వయసులను రప్పించేలా నిన్ను నీవు అలంకరించుకుంటావు.   అవును! వర్ణశోభ, కర్ణక్షోభ తప్ప ఏమున్నాయి…

మనిషి

  మనిషి  ఉండాల్సిన సుగుణాలన్నీ  ఉన్నట్టుగా కనిపించే ఎoడ మావి పేరే మనిషి  ************* తాటికాయలు  నా దేశ సంస్కృతి పై  పడుతున్న తాటికాయలు  ఈ వారాంతాలు  ************* ఎoదుకో? నాడు గంగలా పొంగిన సారస్వతం  నేడు సరస్వతిలా అయిoదెoదుకో  ఈ సినిమా…

చరిత్ర లోకి నేను నడిచాను – హైకూలు

ఆకాశాన్ని దీవిస్తూ అక్షతలు  విడిచిందా  పంట చేను పక్షి  గుంపులుగా *********** కృష్ణుడే వచ్చి కుచేలునికి మూడు గుప్పిళ్ళిచ్చి అతగాడి సర్వస్వం దోచుకోవడమేనోయే రాజకీయమంటే! *********** నలుగురితో సంఘర్షించిన వేళ చరిత్ర లోకి నేను నడిచాను నాతో నేను సంఘర్షించిన వేళ…

తాంబూలం

తాంబూలం ఆమె చేతులను చిగురింప జేసి ఆతను! నాకేది ఆ వర్ణమని అడిగాడు కాబోలు తాంబూల మేసుకొచ్చిందామే ******* వస్తుందా?   అర్ధ రాతిరి ఆడది ఒంటరిగా తిరిగే రోజొస్తుందేమో గాని, ఆ కధా నాయికి ఒంటి నిండా గుడ్డ కప్పుకునే…

గోరు ముద్దలు

గోరుముద్దలు  నిద్దురా మెలకువ కూడా  గోరుముద్దలే  ఒత్తిడికి  ******* గురు దక్షిణ  నాట్యం నేర్పిన గురువని!  ఆ గాలికి  పూలు పత్రాలను రాల్చి  గురుదక్షిణ లిస్తుంటాయి  ఆ చెట్లు  ****** మచ్చలోడు  అందగాడని అందరూ అంటూనే ఉన్నా  మాటి మాటికి  ఆ మబ్బుల…

వింత సృష్టి

 మనసులేని విజ్ఞానం  నలుమూలలా విజ్ఞానులను పోగుచేసి    ఓ వింత సృష్టి చేయమందట    కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లే    ఇకపై పుట్టే ప్రతి శిశువు    లాప్టాపులతో బుక్స్ బాగులతో పుట్టాలని   క్యార్ క్యార్ మనకుండా సర్ మేడం…