పున్నమి

పున్నమి పున్నమి, దీపాన్ని పట్టుకుని గోదారి గట్ల వెంట వెతికేది ఏమై ఉంటుందంటావ్? తెలీదంటావేమిటోయ్ నీ మనసే పాపమోసారి దొరకనివ్వవోయ్ దానికి. ****** ఫాషన్ అందాలన్నిటికీ అందమైన వలువలు కడుతుందా చీకటి ఫాషన్ అంటే ఏమిటో తెలీకుండానే ***** జోడెడ్లు జోడెడ్లే…

జాతి కేతనం

జాతి కేతనం సొమ్ములు మారే చీకట్లోన? శీలం పోయే అంగట్లోన? ఎక్కడ ఎగరాలోయ్ నేనని, అడుగుతుంటే జాతి కేతనం! మౌనంగా నువ్ బదులిస్తావో! మథన పడి మరి అమృతమిస్తావో? ********కీచురాయి చీకటిన ఈ ధాత్రికి ధైర్యం చెప్పే కీచురాయి పాటైనా చేయరేమీ…

కుటుంబం

కుటుంబం గోడకు వేలాడే పటంలోని  నలుగురు ఏరంటే! ప్రపంచపటం లో చూపుతూ  గొప్పలు పోయే కుటుంబాలెన్నో! నా భారతాన.  ******* చందమామలు  భేతాళ కథలు వింటూ  కాలం గడపాల్సిన చందమామలు  భుజానేవో మోసుకుంటూ  కాలంతో పరుగెడుతున్నాయి.  ******* మద్యం సీసా ఒంటి…

చెలీ!

చెలీ!   మింటిలోని ప్రతి తారలోను   నీ రూపునూహించినాను. నల్లబడి నిండు జాబిలి మన పెళ్లి వేళ  నీ బుగ్గన చుక్కౌతానన్నది! ఓ చెలీ!   ******* నీ వాలుచూపులు నాకై రాసిచ్చిన  వీలునామాను చదువుకునే వేళ!  అంత వణుకెందుకే చెలీ…

పెరుగుతూ …

పెరుగుతూ …  పెరుగుతూ  మనిషే కాదు! ఊరు కూడా ఈ మధ్యన  ఆ వల్లకాటినే చేరుతోంది.  ****** గుబాళింపు  ప్రతీ మనిషి పీల్చే గాలిలో  క్వార్టర్ వంతైనా! మద్యం వాసన ఉండేలా  గుబాళిస్తున్నాయి మనగవర్నమెంట్లు.  ******* పసిడి వైభోగం ఆ! తాళి…

గస్తీ

హస్తభూషణం పుస్తకం హస్తభూషణమని అన్నందుకు  నన్ను చెరసాలలో పెట్టాలంటోంది  నా చరవాణి.  ****** విలువలు గోడలు దాటి విజ్ఞానం బయటకు రానపుడు  గుండెలు దాటి లోనికెలా పోతాయోయ్ విలువలు.  ****** బలం నమ్మడానికి  ఇంత తేలికపాటి మనుషులు దొరికే ఈ దేశాన…

మిణుగురులు

మిణుగురులు   నింగి విడిచిన నేల జువ్వలో? గాలిలో షికారుకెళ్ళే దివ్వెలో? చుక్కల ప్రతిబింబాలను పట్టి చీకటికి చూపెట్టే దర్పణాలో? నిశా సౌందర్యానికి, కాలపురుషుడు పట్టే హారతులో? ఈ మిణుగురులు.   ******* అహం   కడవలో నాలుగు రాళ్ళేసి దాహం తీర్చుకున్న…

జోల పాట

జోలపాట నడిరోడ్డుపై, కాసింత కారుణ్యానికై వేదనతో జోలె పడుతున్న తల్లిఆక్రందనలో పడి,కొట్టుకుపోతున్న జోలపాటనెలా పట్టుకుని నిద్దరోతోందో ఆ ఒడిలోని శిశువు. *******ఐకమత్యం   నేటి కాలాన ఐకమత్యం సాధించే నిష్ఫలమేమిటో చెప్పనా!పూలన్నీ దండగా మారి,దండగమారి నేతల పాల్బడడమే. ********మానవత అన్ని కన్నీళ్ళను…

జాబిలి – కలువ

జాబిలి -కలువ నీ చెక్కిలిపై విలాసంగా నవ్వుతున్న నన్ను నేను చూడకనే కలువలై విచ్చిన నీదు కన్నుల జూచి! ఎక్కడా? ఆ నిండు జాబిలని వెతికాను. ******* కొంటె కోణంగి కవ్వించి, కవ్వించి నింగి వెలుగులను దాచేసే ఆ కొంటె కోణంగేనా!…

వానచినుకులు

నాగరికత   అవమానం అనుకోపోతే  నాగరికతకు నేటి ప్రమాణమేమిటో చెప్పనా! నడిరోడ్డుపై పోతున్న మానమే.    ****** వానచినుకులు   బాటసారులై  గగనపు వీధుల సంచరించే  కారుమబ్బులకు పట్టిన  చెమట చుక్కలేమో ఈ వానచినుకులు. ప్రజ్ఞలు  వెలుగులోకొచ్చే స్థోమత లేక  కొన్ని…