మాతృభాష బొడ్డుపేగులోనే కాలపాశమెదురయితే బ్రతికి బట్ట కట్టేదెలా? అంటున్న బేలలా అయింది నా మాతృభాష. ****** రాని యవ్వనం పొగలు, పొంగే నురుగులను తమ ప్రాథమిక హక్కులంటూ, వీధుల్లో ఎలా విహరిస్తున్నాయో చూడు రాని యవ్వనాలు కొన్ని. ******* మనిషి మనిషి,…
Author: S K V Ramesh
విరుల ఆనందబాష్పాలు
విరుల ఆనందబాష్పాలు నిండు జాబిలే దిగొచ్చి వెన్నెల బొట్టెట్టి తన ఇంటి పేరంటానికి తమనాహ్వానించిందంటూ ఆ పూబాలలన్నీ, తమ పై వాలిన మిణుగురులతో కల్లలాడువేళ! కలలో నుండి మేలుకున్న నాపై ! నవ్వుతూ అన్నైతే…
అంతరంగపు చిటపటలు
అంతరంగపు చిటపటలు ఆకాశపు చిటపటలకు మౌనాన్ని నేర్పి తనను తాను పండించుకున్న ఆ బీడులా ఐతే ఎంత బావుణ్ణు నా మనసు, అంతరంగపు చిటపటలకు మౌనాన్ని నేర్పుతూ. ******* ముదుసలి అందం ఆ ముదుసలి అందం ఎడారి చందం అని అందామంటే…
శ్యామలధ్వజం
శ్యామలధ్వజాన్ని పైకెత్తాయా చేలో చేయి చేయి పట్టి ఆ వానచినుకులు. ******* కొబ్బరాకు వెన్నెల పట్టాభిషేకం చేసిన నా పెరటి తోటకు మకుటమై తానమరిందా కొబ్బరాకు ఛాయ. ******* లోటు ఆమె మోస్తున్న కడవలోకి తొంగి చూస్తూ తనకు కాళ్ళు లేని…
ఎవరు వారు?
ఇక దాని బ్రతుకంతమొంది గోడల మధ్యనే గడిచి పోతుందనుకున్నాను రోదనే తప్ప దానికిక నవ్వే యోగమే లేదనుకున్నాను కానీ ఉన్నట్టుండి దానికెవ్వరో పట్టాభిషేకం చేసారు ఇపుడది చిందించే హాసాన ఈ లోకమే మెరిసి మురిసిపోతోంది ఎవరు వారు? కంటికి రెప్పలై, ఇలా…
మానవత్వపు భంగపాటు
అమ్మ లాలనను ఇంకా మరచిందో లేదో గానీ అపుడే ఓ ఇంటి పాలనను అందుకుందది మది తలపులను, గడియపెట్టిన ఇంటి తలుపులను దాటనీయని విద్య నేర్చింది అద్దం లాటి ఆ చెక్కిళ్ళపై పడిన ఐదువేళ్ళ ముద్రలు అద్దంలా…
కష్టార్జితపు మత్తు
కష్టార్జితపు మత్తు ఆమె పిల్లల ఆకలి మంటల్లో ఆతని కష్టార్జితపు మత్తు చమురు పోస్తుంది. ****** మౌనపు విత్తులు నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని విత్తులుగా చల్లుతూ, నా మనసున ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి నీ చూపులు. ******** అనుభూతులు…
వీడ్కోలు
మౌనాలు కమ్ముకొస్తున్నాయి ఇక సెలవంటూ అనుభవాలు జ్ఞాపకాలుగా పరిణమిస్తున్నాయి కాలపు కథ సరే! మామూలే నేస్తం దూరం చేయడానికే దగ్గర చేస్తుందేమో ఇక ఇపుడు మనసుపై మరపు పొరలు కప్పాల్సిందే ఎన్నో గలగలలు కిలకిలలు మరపు రాని జ్ఞాపకాల దొంతరలనిక…
నా మనసు
లోకాన్ని ఓ వైపుకు, నన్నోవైపుకు నెట్టేస్తూ బలవంతానా ఓ విభజన రేఖను గీసిందెందుకో నా మనసు పోనీ! లోకం వైపు ఓ అడుగేద్దాం, దాని అంతరంగాన్ని చదివేద్దాం అనుకుంటే నీదే నిజమంటూ ఎక్కడలేని రాజసాన్ని నాకాపాదిస్తుంది నా కనుసన్నల్లో మెలగాల్సిన కన్నెపిల్ల ఈ…
ఏటిపాట
ఏటిపాట కోయిల గొంతు మూగవోయిందని తన గళమెత్తి ఎలా పాడుతోందో చూడా ఏరు ఈ వనాన. ********మెరుపుకొరడా మెరుపు కొరడా ఝుళిపిస్తే ఇన్ని చెమటలు పోసాయా?ఆ ఆకాశానికి! ********ముత్యాలహారం ఒంపు తిరిగిన ప్రతి చోట ఆ గోదారికో ముత్యాలహారమేయడానికని ఎన్ని ముత్యాలను…
