అలుపెరుగని బాటసారి అలుపెరుగని బాటసారి కదా!అని,నా ఇంట ఓ సారి విడిది చేసి పొమ్మన్నాను.పోతూ పోతూ నాదాన్ని! నినాదాన్నినా ఇంటి, ఒంటి పేర్లుగా మార్చిపోయిందీ గాలంటూమనసులకు హత్తుకునేలా ఎంత మధురంగా చెబుతోందోఆ వేణువు. ************* పచ్చికదీపాలు ప్రభాతకిరణాలకు దారి చూపించాలనితలకు మించిన…
Author: S K V Ramesh
మన్నిక
రైతు బహుశా నేల విడిచి సాము చేయడం నేర్చుకున్నాడేమో నీ రైతు అందుకే దూలానికి వేలాడుతూ అలా ఊగుతున్నాడు అంటోంది గట్టున చెట్టు ఆ చేనుతో. **********మన్నిక నా కలలన్నీ పగిలాయి కానీ మా వాడు కొన్న ఈ జోడు మాత్రం ఊహు, వాడంతే మన్నికకు ప్రాణం ఇస్తాడంటూ రెండు…
ఓ దీపమా!
వెలుగుతో ఓ సంద్రాన్ని సృజియించి అందు ముత్యమై మెరిసేవు నీవు!అలలేవని ఎవ్వరడిగేరు నిన్ను గాలి కూయలలూగేవు నీవు విత్తుకున్నది ఆదిగా! ప్రతి పుటలోనూ, కాంతి పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ నా మనసో వాసంత వాచకాన్ని చదువుతుంది నా కనుపాపలింట నీ వెల్గు…
మనోహర రహస్యం
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> ఎవరు మీటుతున్నారు మిమ్మల్ని ఇన్ని శృతులను మాకై వినిపిస్తున్నారు ఎవరు నేర్పుతున్నారు మీకు మీలో మీరు కలసి ఇన్ని వగలను మాకై ఒలకబోస్తున్నారు తనకు తెలుసేమో! నని ఆ నింగిని నేనడిగితే నాకేమీ తెలీదంటూ…
మరుభూమి
మరుభూమి ఇంతింత దూరం పరిగెత్తుకొచ్చేసి ఆఖరికి అందరూ చేరే చోటు కోసం వెతుక్కుంటోందోయ్ ఊరు. ********** బీడు ఈసురోమంటూ అందవిహీనంగా కూర్చున్న తనను పలకరించే నేస్తమై! నాగలి వచ్చేసరికి…
మృతాభిసారికుడు
వాడు సామాన్యుడు కాడు సంధ్యారుణ కాంతి పుంజాలను కన్నుల దాచిన వాడు అమావాస్య నిశికే తిమిరాన్ని అరువీయ గల అంతరంగమున్నవాడు సగం దేహాన్ని గోతిలో పూడ్చుకుని నిత్యమా మృత్యువుతో బేరసారాలాడేవాడు అవును! వేదన వాడి జీవన నాదమని తెలీక ఒక్కో…
పండుటాకు
పండుటాకుఅడవి పండుటాకుకైనా ఎంత వైభోగానిస్తుందో చూడు ఇప్పటి దాకా ఊయలూపి ఆ గాలి పల్లకీలో మోసుకొచ్చి సెలయేటిలో ఊరేగిస్తోంది మరి నీవో……..? ********* పరమార్ధం పోగు చేసి పోగు చేసి చివరకు పరమార్ధం అర్ధమై చినుకు చినుకును పంచుతూ తాను కరిగిందా కారుమేఘం.…
వర్ణాశ్రువులు
బాల్యాన ముగ్గురు తాతలు చేయిపట్టి సౌందర్య వనాంతరాల కుసుమరాగరంజిత పదాన నన్ను నడిపించారోయ్! ఆపై రూపరేఖా లావణ్యాలతో విచ్చుకున్న నా యవ్వన సోయగాన్ని రసికదిగ్గజాలైన ఆ ఎనమండుగురు ఎంతందంగా వర్ణించారోయ్! భువనైకమోహన హాసవిలాసాన. ఇక నా కౌమార కౌశలాన రవి అస్తమయమే ఎరుగమన్న…
ఉనికి
ఉనికి తన ఉనికిని చాటుకోవడానికి కన్నీటిలో పడి కొట్టుకుపోవడం తప్ప వేరే దారేదీ మనసుకి. ******* తులాబారం అనురాగాల తులాబారంలో తులసాకు కాలేకపోతోంది ఆ కన్నీటిబొట్టు. ******** మనసులు ఎద సడికి రూపమిచ్చా నది ఆకాశాన్ని ఆహ్వానిస్తే చినుకు శృతిలో నిన్నటి…
గులకరాళ్ళు
మట్టి, ఇసుక మేఘాలుగా కమ్మిన నిండు చంద్రుళ్ళు నలుపు, ఎరుపు గొంగళ్ళు కప్పుకుని మట్టిలో మొద్దు నిదరోతున్న బట్ట బుర్రల తాతలు మేఘం గాలికి కదిలినా, గొంగళి నీళ్ళకు చివికినా నిండు చంద్రోదయం లాటి పాత పలకరింపుతో యకాయకి నా మనసు…
