నిగర్వి నేను నిగర్వినే ఐనా నాలోని గర్వాన్ని బయట పెడుతుందా అద్దం. ********** వీణ తీగలు ఆకాశం నుండి చూస్తే వీణ తీగలుగా కనబడిన ఆ నదీ పాయలను మీటుదామని ఉన్నపళంగా బయలుదేరిన జాబిలికి అడ్డొచ్చి అసలు నిజాన్ని చెబుతున్నాయా మేఘాలు. *********** ఊహల పూదోట మృత్యువంత…
Author: S K V Ramesh
తలపులు
ఆ తలుపులు తెరవకోయ్ స్పందించవేమని నన్ను నిలదీసే ప్రకృతి అందాలెన్నో ఆగున్నాయ్ వాటి వెనుక నిజమే ఏకాంతం దొరికిననాడెపుడో చూసా అమ్మ లాలిపాటలా అడిగినవి కొన్నైతే మేఘ గర్జనలా విరుచుకుపడ్డవేన్నో అందుకే ఆ తలుపులు తెరవకు సరేలే! తెరవను గానీ అసలెందుకొచ్చిందో చెప్పవోయ్…
మరణం
మరణం నిజంగా మరణం నీ సమస్తేంద్రియాలను ఒప్పచేప్పేసేంత మంచి కలేమిటోయ్. ******* టోల్ గేట్ మేఘాలకు టోల్ గేట్ ఆ కొండ. ****** కాలం పోటీ పడే అవకాశం ఎవరికిచ్చింది గనుక ఆ కాలం ఓడింది గెలిచింది అనడానికి. ****** మెరుపు…
బీడు
చిటపట అల్లరి చేసిన వాన చినుకులకు నోరు తెరిచిన బీడు జోల పాడింది. **** తాను రాసిన పాటను పాడడం కోసమని ఎన్ని గొంతులను మేల్కొల్పిందో ఆ ఉదయ సుందరి. ***** ఎంతకాలమలా నిలబడుతుంది పాపమని తనపై పడిన చెట్టు నీడను…
కూడికలు తీసివేతలు
ఎన్ని భావాలనైనా మోయడానికి పుష్పకమేమీ కాదోయ్ నా మనసు! కూడికలు తీసివేతలు నేర్పే చిన్న బడిలోని నల్లబల్ల అందుకే ఒకటి చెరిగితే గానీ ఇంకొకటి దాని మీదకి రాదు మరి నిజానికి కూడికలు తీసివేతలు అనే ఈ రెంటి నడుమ నిత్యం జరిగే సంఘర్షణలో…
గాయాలూ ఆపాతమధురాలే
నా కోసం అన్నైతే అనుభూతుల పూలను పూయించింది గానీ, కాలం వాటితో హారమల్లుకునే నేర్పు నాకింకా అబ్బింది కాదు ఏం చేయను తీరిక లేని తనంతో ఆ పూలెప్పుడు వికసించింది, వాటి పరిమళమేపాటిదని కూడా చూసింది లేదు ఇక మాధుర్య మకరందమంటావా!…
మృత అభిసారికలు
కదులుతాయి కన్నీరు కారుస్తాయనిశవాలనం గానీవాటికన్నా గొప్పవేమీ కాదుఆటవిడుపు వాంఛలు తీర్చే వారి దేహాలుసానుభూతంటే ఎరుగని సహనం వారి సొంతందేహాలపై గాయాలెన్నో విరబూసినావాటిలో కూడా మధువునెతుక్కునేతుమ్మెదల రూపాలనుకన్నీటితో కడుగుతూ మరో తేటినివెదికేందుకుముఖం పై నవ్వు దీపాలను వెలిగించాల్సిందేభాగ్యము వారిది కాదంటూ వారి కన్నీళ్లుచెప్పకనే…
సర్దుకుపోదాం
మనకున్నదంతా గతమేనోయ్ దాన్నే అప్పుడప్పుడూ తవ్వుకుంటూ దాచుకుంటాం వర్తమానం భవిష్యత్తులుగాఎందుకంటే సర్దుబాటులో సవ్యసాచులం మేము నిన్నటి మా అనాకారీ బ్రతుకే నేడు ప్రాభావమై తోస్తుంది మాకుఎప్పుడూ మారనిదే మా చరిత్రని తెలిసిన మర్మయోగులం కదా మేము ఇంకా రేపెలా అనే భయం…
నవ్వు
నీలా నవ్వే నవ్వును నన్ను నవ్వించమని నవ్వుతూ నేనడిగితే ఆ నవ్వు నవ్వుకుని నవ్వుతూ నాతో నవ్వులనే నవ్వించే నవ్వుతో నీలో ఆమె నవ్వుతూ ఉంటే నాతో ఈ నవ్వులాట ఎందుకని నవ్వుతూ వెళ్ళిపోయింది. ****** చుక్కలున్న రాతిరి వెతికితే గానీ…
ఎవరివో నీవెవరివో
ఏ ఆమని పిలుపులతో చిగురించిన తొలకరివో ఏ వెన్నెల వలపులతో విరబూసిన కలువవో నా కన్నుల చూపులలో నటనమాడు కొమలివో ఎవరివో నీవెవరివో దివి చూడని అందానివో కవి రాయని పాటవో గాలి పాడని లాలివో భువిని లేని…
