ఎన్ని మహానదుల్లో మునుగుతున్నా చంద్రుడిలోని మచ్చలు పోవు ఎన్ని మబ్బులు కమ్ముకుంటున్నా ఆ నవ్వులోని స్వచ్ఛతా పోదు! @@@@@
Author: Subrahmanyam Mula
అల
చల్లని అల వచ్చి చిట్టిపాదాల్ని స్పృశించగానే పసిమనసులో అలలెత్తిన ఆనందం ఈ క్షణం నేను తీరాన ఇసకను! <a href=”http://www.bidvertiser.com”>pay per click</a>
ప్రేమ
చినుకు చినుక్కీ పులకించిపోయే సెలయేటివి నువ్వు నిలువునా కురిసి తేలికపడే నీలిమబ్బుని నేను గమనించావా.. ఇద్దరిలోనూ ఒకే తడి!
ఒకే కవిత్వం
నీలో కొన్ని కదలికలు నీలో ఒక పాపాయి రూపుదిద్దుకుంటోంది నాలోనూ కొన్ని కదలికలు నాలో ఒక పద్యం రూపుదిద్దుకుంటోంది అంతా ఒకే కవిత్వం నీలో చిట్టితల్లిగా నాలో అక్షరాలుగా!
ఈ కాసిన్ని అక్షరాలు..
1. శృంగేరిలో సూర్యాస్తమయం తుంగనది అనంతంలోకి.. ఓంకారం మౌనంలోకీ.. నదిలో చేపలు.. మదిలోనో? దేన్నీ పట్టుకోలేను చంటాడితో పాటు నాకూ కొన్ని కొత్త అక్షరాలు!? గుడిలో అమ్మ నవ్వుతుంది. 2. పాటే అక్కరలేదు ఒక్కోమాటు చిన్న మాటైనా చాలు జ్ఞాపకాల…
కవిత్వం మీద రెండు కవితలు
1. మేఘాల భారాన్నిచినుకుల్లోకి అనువదించేసేఆకాశానికి తెలుసుఅసలు రహస్యం 2. లోపలి సంగీతానికిఅనుగుణంగా నర్తించే అక్షర నక్షత్రాలమ్యూజికల్ ఫౌంటైన్ !
ఎక్కడికో…
ఇవాళైనా ఏమైనా చెప్తావని ప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చి నిల్చుంటాను మలుపులు తిరుగుతూ ఏ మార్మికతల్లోకో మౌనంగా వెళ్ళిపోతావు కదిలే ప్రవాహంలో కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా “నేను” మిగిలిపోతాను!
అలజడికి అటువైపు
1. అలజడిరైలు ప్రయాణంచీకట్లో ఏ సొరంగాన్ని దాటుతున్నావంతెనపై ఏ ప్రవాహాన్ని దాటుతున్నాఎదురౌతున్న మరో రైలును దాటుతున్నా అదే అలజడి! 2. అటువైపుసీతాకోక ఎగురుకుంటూకట్లపాము పాక్కుంటూకప్ప గెంతుకుంటూరోడ్డు దాటేసాయి. నేనెప్పుడో..!
ఆలాపన
చీపుర్ల సామాజిక స్పృహ అంట్లగిన్నెల అస్తిత్వ వేదనపొద్దుటి రణగొణ ధ్వనుల్ని చీల్చుకుంటూ… ఏ రేడియోలోంచో ఓ ఆలాపనలీలగా వినిపించి ఆగిపోతుంది ఇక నీ మనసు మనసులా ఉండదు ఏ పని మీదా దృష్టి నిలవదు ఏదో గుర్తొచ్చినట్టే ఉంటుంది చిరపరిచిత రాగంలాగే…
కొన్ని సెన్ర్యూలు
1.వంట చేస్తుంటేఘంటశాల పాటఎన్ని విజిల్సొచ్చాయో? 2.గేదెలా దోమల్నిచెవులతో తోలుకోగలిగితేఎంత బావుణ్ణు? 3.వేరుశనగ పలుకులుఒలుచుకు తినాలనిఈ కోతికెలా తెలిసిందో! 4.గేదెతెల్లబడిందికాకి వాలగానే 5.లిఫ్టులో కొత్తమ్మాయివంద అంతస్తులుంటేఎంత బావుణ్ణు! (సెన్ర్యూ : హాస్య రస ప్రధానమైన హైకూ )